@ncbn @naralokesh @PawanKalyan వైద్య విద్యను ప్రైవేటీకరించవద్దు. GO 107, 108 రద్దు చేయండి.

The Issue

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ గారు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజులలో ప్రభుత్వ కళాశాలలలొ వైద్య విద్య చదువుకోవాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న గత వైస్సార్సీపీ పార్టీ జగన్ గారి ప్రభుత్వ హయాములో ఇచ్చిన GO 107, 108 రద్దు చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సినదిగా విజ్ఞప్తి.

వైఎస్ జగన్ గారి  ప్రభుత్వ హయాములో 19th July, 2023న ఇచ్చిన GO 107, 108  వలన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటాలో విద్యార్థులకు కేటాయించవలసిన సీట్స్ లలో సగభాగం అనగా 50% సీట్స్ ని సెల్ఫ్ ఫైనాన్స్     (35%), NRI కేటగిరీ లకు (15%) కేటాయించి సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ సీట్లకు సంవత్సరానికి రూ.12 లక్షలు, NRI కేటగిరీ సీట్లకు సంవత్సరానికి రూ.20 లక్షలు ఫీజులు పెట్టారు. ఈ రెండు కేటగిరీలలో రిజర్వేషన్ పాలసీ వర్తించదు. కన్వీనర్ కోటాలో జనరల్ కేటగిరీ కి సంవత్సరానికి ఫీజు 15 వేల రూపాయలు.

2023వ సంవత్సరము తర్వాత కొత్తగా స్థాపించిన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ GO 107, 108 అమలు చేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ గారి  ప్రభుత్వ హయాములో మన రాష్ట్రములో కొత్తగా ప్రారంభించిన మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల అమ్మకానికి తెరలేపారు. కేంద్ర, రాష్ర ప్రభుత్వ నిధులతో కట్టిన ఈ ప్రభుత్వ కాలేజీలలో సీట్ల భర్తీకి సెల్ఫ్ ఫైనాన్స్ మరియు ఎన్నారై కోటాను ప్రవేశపెట్టడం జరిగింది.

నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈ 5 కాలేజీలలో కాలేజీల్లో 150 సీట్ల చొప్పున మొత్తం 750 సీట్లకు అనుమతి వచ్చింది. వాటిలో 15 శాతం ఆలిండియా కోటాలో అంటే 113 సీట్లు పోగా మిగిలిన 637 సీట్లను ఏపీలో కన్వీనర్ కోటా ఏ కేటగిరీలో రిజర్వేషన్లను అనుసరించి ప్రతిభ ఉన్న వారితో భర్తీ చేయాల్సి ఉంది.

కానీ GO 107, 108ల వలన ప్రస్తుతం జనరల్ కేటగిరీలో కేవలం 50 శాతం అంటే 319 సీట్లు మాత్రమే మిగిల్చారు. 35 శాతం అంటే 223 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో బీ కేటగిరీ సీట్లుగా మార్చారు. దానికి ఏడాదికి రూ.12 లక్షల చొప్పున ఫీజుగా ప్రకటించారు. మరో 15 శాతం సీట్లను అంటే 95 సీట్లు ఎన్నారై కోటాలో చేర్చారు. ఏడాదికి రూ.20లక్షలు ఫీజుగా జీవోలో పేర్కొన్నారు. అంటే ఎంబీబీఎస్ కోర్సు కోసం     బీ కేటగిరీ విద్యార్థి సుమారుగా రూ.60లక్షలు, ఎన్నారై కోటాలో కోటి రూపాయలు చెల్లిస్తేనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు దక్కుతుంది.

ఉదాహరణకు కొత్తగా ప్రారంభించిన ఒక కాలేజీలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చిన 150 సీట్లకు గానూ 22 సీట్లు ఆలిండియా కోటాలో పోతే మిగిలిన 128 సీట్లు ఎన్టీఆర్  హెల్త్ యూనివర్సిటీ తరపున కన్వీనర్ కోటాలో ఏ కేటగిరీలో కేటాయించాల్సి ఉంది.

ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ–ఎ 7 శాతం, బీసీ–బి 10 శాతం, బీసీ–సి 1 శాతం, బీసీ–డి 7 శాతం, బీసీ–ఇ 4 శాతం కేటాయించాల్సి ఉంది. దానిని అనుసరించి ఎస్సీలకు 19 సీట్లు, ఎస్టీలకు 8 సీట్లు, బీసీ–ఎ కి 9 సీట్లు, బీసీ–బి కి 13, బీసీ–సికి 1 సీటు, బీసీ–డి కి 9, బీసీ–ఇకి 5 సీట్ల వరకూ సుమారుగా దక్కాలి. మొత్తం ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థులకు కలిపి 64 సీట్లు రావాలి. అవి కాకుండా స్పోర్ట్స్, ఎన్‌సీసీ, పోలీస్ అమరవీరులు, దివ్యంగుల కోటా వంటి వివిధ రిజర్వేషన్ కోటాలో కూడా సీట్ల కేటాయింపు ఉంటుంది.

కానీ GO 107, 108 నిబంధనల వలన 2023వ సంవత్సరము తర్వాత కొత్తగా ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఆలిండియా కోటా పోగా మిగిలిన 128 సీట్లలో 64 సీట్లను బీ, సీ కేటగిరీలుగా మార్చేశారు. 

దీని వలన ఎస్సీలకు 10 సీట్లు, ఎస్టీలకు 4 సీట్లు, బీసీ–ఎ కి 4 సీట్లు, బీసీ–బి కి  6 సీట్లు,, బీసీ–సి కి 1 సీటు, బీసీ–డి కి 4, బీసీ–ఇ కి 3 సీట్లు దక్కుతున్నాయి. ఈ GO 107, 108ల వలన 64 సీట్లకు మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో సగానికి సగం సీట్స్ కోల్పోయి కేవలం 32 సీట్లు మాత్రమే అంటే సగం సీట్స్ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు దక్కుతున్నాయి.

ఈ GOల వలన మెరిట్ కేటగిరీ విద్యార్థులు మరియు రీసెర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు ఇద్దరూ నష్టపోతున్నారు. ఒక కాలేజీ లోనే ఇలా సగానికి సగం సీట్స్ తగ్గిపోతూవుంటే 2023 తరువాత మన రాష్ట్రములో నూతనముగా నిర్మిస్తున్న, NMC అనుమతులు పొందుతున్న కాలేజీలు మొత్తం కలుపుకుంటే కొన్ని వేల     సీట్స్ ని మెడికల్ విద్యార్థులు కోల్పోతున్నారు.

2023 వ సంవత్సరములో కొత్తగా ప్రారంభమైన 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో  మొత్తం సీట్లలో 85 శాతం ప్రతిభ ఉన్న వారికి దక్కాల్సి ఉండగా, కేవలం 42.5 శాతం అంటే సగం సీట్లు మాత్రమే మెరిట్ కేటగిరీ విద్యార్థులకు దక్కుతున్నాయి. మిగిలిన సీట్లను ప్రభుత్వం అమ్మకానికి పెడుతోంది. కన్వీనర్ కోటాలో కేటాయించవలసిన సీట్స్ లలో సగభాగం 50 % సీట్స్ ని NRI, సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ సీట్స్ కి బదలాయించడం వలన ప్రభుత్వ కళాశాలలలొ వైద్య విద్య చదువుకోవాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన మెరిట్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. వారు కన్వీనర్ కోటాలో పొందవలసిన సీట్స్ ని కోల్పోతున్నారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసించాలి అని ఆశిస్తున్న విద్యార్థులకు ఈ GO 107 108 వలన  జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసి, ఈ GO లను రద్దుచేయాలి అని  కొందరు విద్యార్థులు గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో Writ Petition వేయడం జరిగింది. విద్యార్థులు వేసిన పిటిషన్ WP/20137/2023, WP/20384/2023. ఈ కేసులు ప్రస్తుతం విచారణలో వున్నవి.

విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం విషయమై  నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ (NCSC), నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST), నేషనల్ కమిషన్ ఫర్ బాక్క్వర్డ్ క్లాస్సేస్ (NCBC)  మరియు మినిస్ట్రీ అఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ (MSJEGOI) వారికి రెప్రెసెంటేషన్స్ ఇచ్చి  ప్రభుత్వ వైద్య కళాశాలలలొ  వైద్య విద్య చదువుకోవాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయవలసినదిగా కోరడమైనది.

GO 107, 108ల వలన  విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం విషయమై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో 2024 ఆగష్టు నెల 6 వ తేదీన జరిగిన హియరింగ్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు పాల్గొనడం జరిగింది.  గిరిజన  తెగల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు  హుస్సేన్ నాయక్ గారు పరిశీలించారు.

రిజర్వేషన్ పాలసీకి వ్యతిరేకముగా వున్న GO 107, 108 వలన వైద్య విద్యకు దూరం అవుతున్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని  నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) వారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ GO లను అమలు చేసే విషయములో పునరాలోచించవలసినదిగా కోరారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్  చేసిన సూచనలపై నెల రోజుల లోపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో ఆ రిపోర్ట్ ని కమిషన్ కు పంపించమని కోరడం జరిగింది.

వైద్య విద్యార్థులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు తీవ్రంగా ఖండించి ఈ GO లను రద్దు చేయవలసినదిగా అనేక ఉద్యమాలు చేసాయి.

ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడిన తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ కళాశాలలలొ  వైద్య విద్య చదువుకోవాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న గత ప్రభుత్వం ఇచ్చిన  GO 107, 108 లను తమ  కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో రద్దు చేస్తామని నారా లోకేష్ గారు యువగళం కార్యక్రమంలో (2023 ఆగస్టు 16న మంగళగిరిలో) విద్యార్థులకు వాగ్దానం చేశారు.

అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, పలు సందర్భాలలో GO 107, 108 వలన వైద్య విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత GO 107 108 రద్దు చేయాలి అని విద్యార్థులు వేసిన పిటిషన్ WP/20137/2023, WP/20384/2023 విచారణ సందర్భముగా (2024  జూలై 12వ తేదీన) కూటమి ప్రభుత్వం గత జగన్ గారి ప్రభుత్వములో ఇచ్చిన GO లను కొనసాగిస్తాము, వీటిని రద్దు చేసే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని హైకోర్ట్ కు తెలియచేసారు.

2024 ఆగష్టు 7వ తేదీన జరిగిన కూటమి క్యాబినెట్  మీటింగ్ లో GO 107 108 రద్దు చేయాలి అనే విషయం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను, నియోజకవర్గం లో వున్న ప్రభుత్వ హాస్పిటల్స్ని  ప్రైవేట్ పరం చేసేలా ప్రభుత్వ ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్  (Public–private partnership PPP) అంశంను తెరపైకి తెచ్చి గుజరాత్ వెళ్లి ప్రభుత్వ ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్ అధ్యయనం చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

గుజరాత్ రాష్ట్రములో ప్రభుత్వ ఆధ్వర్యములో నిర్వహిస్తున్న 6 మెడికల్ కాలేజీలలో  సంవత్సరానికి 25 వేల ఫీజుగా నిర్ణయించారు. గుజరాత్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సొసైటీ (GMERS) వారి ఆధ్వర్యములో వున్న 13 మెడికల్ కాలేజీలలో (MBBS Govt-Aided Colleges ) (SFI - సెల్ఫ్ ఫైనాన్సుడ్ ఇన్స్టిట్యూట్) కేటగిరి A లో (జనరల్ కోటా) ఎవరైనా మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంబీబీఎస్ సీటు సాధిస్తే  సంవత్సరానికి ₹3.5 లక్షల వరకూ ఫీజు కట్టాలి. కేటగిరి B లో (మానేజ్మెంట్ కోటా)  సంవత్సరానికి  ₹12లక్షలు, కేటగిరి C లో (NRI కోటా)  సంవత్సరానికి  20లక్షల ఫీజు ($25000) కట్టాలి.  

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) గుజరాత్ మోడల్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అమలు చేస్తే మన రాష్ట్రములో ఎంతమంది ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ ఫీజు లు కట్టే స్తొమత ఉంటుందో కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఫీజు రీయింబర్సుమెంట్, రిజర్వేషన్ పాలసీ లు వర్తించని ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్ ఎలా ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులుకు మేలు చేస్తుందో కూడా ప్రభుత్వం పునరాలోచించాలి.

కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ  అఫ్  హెల్త్  అండ్  ఫామిలీ  వెల్ఫేర్  వారి  Centrally Sponsored Scheme (CSS) లో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో  ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించే అవకాశం ఉండగా  వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద నిర్దేశిత ప్రాజెక్టు వ్యయంలో 30% నుంచి 40% కేంద్ర ప్రభుత్వం, మరో 30% వరకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి మిగిలిన మొత్తాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) విధానంలో ముందుకొచ్చే ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెట్టి ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహణ, విద్యార్థుల చదువును ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు భావ్యం?  

ఒక వైపు ప్రతి సంవత్సరం వేలమంది వైద్య విద్యార్థులు వైద్య విద్యని ముగుంచుకుని బయటకు వస్తున్నారు, దేశవ్యాప్తంగా ఉద్యోగాలు లేకుండా వున్న నిరుద్యోగ వైద్యులు లక్షన్నర మంది వున్నారు అని గణాంకాలు చెప్తున్నాయి.

ఇలాంటి పరిస్దితులలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటాలో విద్యార్థులకు కేటాయించవలసిన సీట్స్ లలో సగభాగం అనగా 50 % సీట్స్ ని సెల్ఫ్ ఫైనాన్స్     (35%), NRI కేటగిరీ లకు (15% ) కేటాయించి సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ సీట్లకు సంవత్సరానికి రూ.12 లక్షలు, NRI కేటగిరీ సీట్లకు సంవత్సరానికి రూ.20 లక్షలు ఫీజులు పెట్టడం ఎంతవరకు భావ్యం?

GO 107,108 వలన  జరిగే అన్యాయం కంటే ఆరోగ్య విద్య, వైద్య రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) వలన ఇంకా ఎన్నో రెట్ల అన్యాయం ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు జరుగుతుంది. ప్రభుత్వ కళాశాలలలొ  వైద్య విద్య చదువుకోవాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత జగన్ గారి ప్రభుత్వం అయినా ఇప్పటి కూటమి ప్రభుత్వం అయినా ఇద్దరూ తీరని అన్యాయం చేస్తున్నారు.

జగన్ గారి ప్రభుత్వ హయాములో నిర్మించ తలపెట్టిన ఫేస్ - II మెడికల్ కాలేజీలు - మార్కాపురం , మదనపల్లి , పులివెందుల మరియు ఆదోని & ఫేస్ - III మెడికల్ కాలేజీలు - నర్సీపట్నం , అమలాపురం పాలకొల్లు , బాపట్ల మరియు పెనుగొండ) తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలును కూటమి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానములో నిర్మించడానికి అడుగులు వేస్తూ అధ్యయనం చేయమని G O RT No. 27 23-01-2025న ఇవ్వడం జరిగింది. ఇదే జరిగితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భవిష్యత్తులో వైద్య విద్య మరియు ఆస్పత్రుల నిర్వహణ ప్రైవేట్ పరం అయ్యే అవకాశాలున్నాయి.

దయచేసి కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన విధముగా GO 107, 108 రద్దు చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్య విద్య, వైద్య రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) విధానాన్ని విరమించుకోవలసినదిగా విజ్ఞప్తి.

avatar of the starter
Pradeep KumarPetition Starter

14

The Decision Makers

Nara Chandra Babu
Nara Chandra Babu
Andhra Pradesh Chief Minister
Pawan Kalyan
Pawan Kalyan
Andhra Pradesh Deputy Chief Minister
Nara Lokesh
Nara Lokesh
Andhra Pradesh Education Minister
Satya Kumar
Satya Kumar
Andhra Pradesh Health Minister

Petition Updates