Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APబోయల నోళ్లు మూయించి, సంకెళ్లు వెయిస్తే..ఎస్టీ ఉద్యమం ఆపలేరు ముఖ్యమంత్రి కేసీఆర్!
Venkateshwarlu BoyaHyderabad, India
Mar 7, 2022

తెలంగాణ కేసీఆర్ వనపర్తి జిల్లాలో అడుగు పెట్టే ముందు.. ఒకసారి తెలంగాణ రాకముందు ఇదే వనపర్తి సభలో వాల్మీకి బోయల కిచ్చిన హామీని గుర్తు చేసుకోవాలి. గత 70 ఏళ్లుగా పాలకులు మారారు గాని వాల్మికి బోయల స్థితిగతులు మారలేదు. వారి జీవనం ఇంకా అస్తవ్యస్థగా గానే ఉంది. వారిని ఎస్టీలుగా గుర్తించి తక్షణమే వారికి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. 


వనపర్తి ఙిల్లా కేంద్రంలో ఙరిగే బహిరంగ సభకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆకు    వాల్మీకి బోయలను ఎస్టీ ఙాబితాల్లో కలుపాలంటూ  విన్నవించేందు వెళ్లేందుకు సిద్దమౌతున్న ఉమ్మడి మండలాల అధ్యక్షులు భీమన్న నాయుడిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టులతో బోయల రాజ్యాంగ హక్కును ఎవరు అడ్డుకోలేరు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని అక్రమ అరెస్టులు చేయిస్తే..పాలకులు ఎంత వంచన కు గురి చేస్తే వారి ఉద్యమ పోరాటం అంతకంతకు పెరుగుతుంది గాని తగ్గదు. తెలంగాణలో ఉన్న వాల్మీకులందరు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును గమనిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు వాల్మీకులను ఎస్టీ జాబితాల్లో చేర్చుతానని హామీ ఇచ్చి అది మైనార్టీ బిల్లుతో కలిపి ఇవ్వడం ఆయన నయవంచన కు నిదర్శనం. ఇచ్చిన హామీ విస్మరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వాల్మీకులు మొన్న గద్వాలకు కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పిన విషయం తెల్సిందే. ఆనాడు కూడా మా ఎంపీ రాములు ఉన్నడు చూసుకుంటాడు అని తప్పించుకున్నారు. 


2015 లో చెల్లప్ప కమిటీ వేసి బోయల స్థితిని అధ్యయనం చేసి రెండేళ్లకు రిపోర్ట్ ఇస్తే..2016-17లో అసెంబ్లీ సాక్షిగా బోయలను ఎస్టీలుగా గుర్తిస్తూ ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు కేబినేట్ ఆమోదం, అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మైనార్టీ రిజర్వేషన్ 6శాతం బిల్, ఎస్టీ రిజర్వేషన్ 10శాతం పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేంద్రానికి పంపుతాడు. దాని సాధ్యాసాధ్యాలపై అంచనా వేయకుండా…కేంద్రం చేయకపోతే మెడలు వంచి ఢిల్లీలో పోరాడుతాం అని ప్రకటించి నేటికి 7ఏళ్ళు అయ్యింది. అయినా ఏక్కడ వేసిన గొంగడి అక్కడే.


ఆనాడు నీలం సంజీవరెడ్డి చేసిన దుర్మార్గపు చర్య నేటికి దాని నుంచి కొలుకోలేక పోతున్నారు బోయలు.  వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు, నేటి ముఖ్యమంత్రి అందరూ బోయలను తప్పకుండా ఎస్టీలో చేర్చుతాం అని చెప్పి మాట నిలబెట్టుకోలేదు. అంతకుముందు ఎస్టీ లో ఉన్న ఎరుకల, యానాది , బోయలను ఎస్టీ 1956-72 ప్రాంతంలో తన భూమి పై ఒక్కడు చేసిన, చిన్న తగాదాకి వీళ్లు రాజకీయంగా ఎదిగితే తన జాతికే అడ్డొస్తారని సంజీవరెడ్డి పీరియడ్ లో బోయలను ఎస్టీలో నుంచి బీసీలో వచ్చేటట్టు చేసినాడు. అలా ఎస్టీ ఫలాలు పొందాల్సిన ఆటవిక తెగలైన బోయలు అత్యంత వెనకబడిన, అట్టడుగు వర్గాలుగా ఉపాధి లేక, రాజకీయల్లో వెనకబడి బీసీలలో కూడా నిరాదరణకు గురయ్యారు బోయలు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.

వేంకటేశ్వర్లు బోయ, సీనియర్ జర్నలిస్ట్

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X