Aggiornamento sulla petizioneMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయల ఎస్టీ పునరుద్ధరణ అంశం ఇప్పుడు బీజేపీ కోర్టులో...!

Venkateshwarlu BoyaHyderabad, India
9 dic 2021

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని..అందుకు ఏ ఏ అంశాలు తోడ్పడతాయి అని రంగంలోకి దిగింది అమిత్ షా టీమ్. అందులో మన వాల్మీకి బోయల ఎస్టీలో చేర్చేందుకు ఆలోచనలు జరుగుతున్నాయి.

2021 నవంబర్ నెలలో కేంద్రమంత్రి  అమీత్ షా గారు తిరుపతి నెల్లూరు పర్యటన సందర్భంగా నెల్లూరు లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కోర్కమిటీ సమావేశం నందు ఏ అంశాలైన ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి అభివృద్ధికి ఉన్నాయా అని అడిగిన వెంటనే కన్నా లక్ష్మీనారాయణ గారు సత్య కుమార్ గారు పురందేశ్వరి గారు వాల్మీకుల ఎస్టీ అంశం ఒకటి ఉంది వాల్మీకులను ఎస్టీల్లో చేర్చితే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో బిజెపి పార్టీ బలపడుతుందని అమిత్ షాగారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి..ఒక తీర్మానాన్ని కోర్కమిటీ ద్వారా ఢిల్లీ కార్యాలయానికి పంపమని రాష్ట్ర బీజేపీ నాయకులకు చెప్పి ఆదేశించడం జరిగిందని సమాచారం.

నిన్న అనగా 08-12-20 21వ తేదీ నాడు నాయకులు జగదీశ్వరరావు వారి బృందం కన్నా లక్ష్మీనారాయణ గారిని సంప్రదించిన వెంటనే ఆంధ్రప్రదేశ్లోని వాల్మీకి లను ST జాబితా లోనికి  వెంటనే చేర్చాలని కోరుతూ హోమ్ మంత్రి గారినీ కోరడం జరిగిందని తెలుస్తోంది.

ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర బీజేపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇది మనకు శుభ ఫలితాలు తెస్తుందని ఆశిద్దాం..!

Copia il link
WhatsApp
Facebook
X
E-mail