Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

దళిత వాల్మీకులకు పెద్దపీఠ: పంజాబ్ లో తొలి దళిత సీఎం చరణ్ జిత్ సింగ్!

Venkateshwarlu BoyaHyderabad, Inde
19 sept. 2021

దళిత వాల్మీకులకు పెద్దపీఠ: పంజాబ్ లో తొలి దళిత సీఎం చరణ్ జిత్ సింగ్!

వాల్మీకి దళిత వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్నాకు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇది నిజమైతే ఆయనే తొలి దళిత పంజాబ్ సీఎం అవుతారు. ఆ రాష్ట్ర రాజకీయ నాయకుల మధ్య సయోధ్య కుదరక పోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఇటు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ కు, నవజ్యోత్ సింగ్ సిద్దుకు అనుకూలంగా వుండే చాంకూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే చరణ్ జిత్ సింగ్ చన్నా ను పంజాబ్ ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించినట్టు ఢిల్లీ నాయకుల సమాచారం.

ఢిల్లీ మహారాష్ట్ర సదన్ లో "వాల్మీకుల గెట్ టు గెదర్"

దేశ వ్యాప్తంగా హాజరైన వాల్మీకి నాయకులు వాల్మీకులకు అన్ని రాష్ట్రాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితి తులలో మార్పు రావాలని, విద్య, ఉద్యోగంలో, మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించాలని కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాల్మీకి కమ్యూనిటీ లీడర్లు,పెద్దలు, స్వామీజీలు,మహిళలు ఢిల్లీ న్యూ ఇండియా గేట్ , కస్తూర్భాగాంధీ మార్గ్ లోని మహారాష్ట్ర సదన్ లో మీట్ అయ్యారు. ఈ సదస్సుకు కేంద్ర సామాజిక, సాధికారత శాఖ మంత్రి శ్రీ రాందాస్ అత్వాలే హాజరయ్యారు.

వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలి: కాలువ శ్రీనివాసులు

గత ఆరు దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంద్రప్రదేశ్ వాల్మీకి బోయలు తమను ఎస్టీలుగా గుర్తించాలని ఉద్యమం చేస్తున్నాం అని ఢిల్లీ గెట్ టు గెదర్ లో గళం విప్పారు. కర్ణాటక మంత్రి శ్రీరాములు, ఏపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, డాక్టర్ పార్థసారథి, వనపర్తి నారాయణ, నరసింహులు, ననూర్ గోపాల్ తదితరులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు.

- వెంకటేశ్వర్లు బోయ, తెలంగాణ, జర్నలిస్ట్, 9391204009

https://youtu.be/ioIAiM8ZaUc

Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail