

ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంత వాల్మీకి మరియు వారి ఉపకులాలను వెంటనే గిరిజన జాబితతాలోకి చేర్చండి
*ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకులందరిని గిరిజనలుగా గుర్తించాలి*
*కొద్ది పాటి రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న ఏజేన్సీ వాల్మీకులను గిరిజన జాబితాలోంచి తొలగించే కుట్ర జరుగుతోంది*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి మరియు వారి ఉపకులాలను ప్రభుత్వ పథకాల అధికారిక వెబ్సైట్లో తొలగించటం అత్యంత దుర్మార్గమైన చర్య*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు రిజర్వేషన్ విషయంలో ఏ గిరిజన జాతికి లేని ఏరియా పరిమితి రిజర్వేషన్ పద్దతి వాల్మీకి మరియు నాయక్ అనే గిరిజన తెగలకు మాత్రమే ఎందుకు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏజేన్సీ ప్రాంతం వాల్మీకి మరియు దాని ఉపకులాలను ప్రభుత్వ పథకాల అధికారిక వెబ్సైటుల నుంచి తొలగించటం అత్యంత దురదృష్టకరమైన చర్య అని ఇది రాజ్యాంగం అనుసరించి గిరిజన చట్టాల ఉల్లంఘన క్రిందకే వస్తుందని దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరిచేసేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో గిరిజన హక్కులను కాలరాసే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంను బర్తరఫ్ చేయాలని భారత ప్రభుత్వ గిరిజన పరిరక్షణ అధికారి మరియు దేశ ప్రథమ పౌరుడైన గౌరవ రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేస్తామని ఆల్ ఇండియా వాల్మీకి సమాజం జనరల్ సెక్రటరీ జక్కుల శ్రీనివాసరావు అన్నారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి మరియు దాని ఉప కులాల సంబంధించి గిరిజన రిజర్వేషన్ విషయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైదాన ప్రాంత వాల్మీకి మరియు వారి ఉప కులాలను కూడా గిరిజన జాబితాలోకి చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న 35 గిరిజన తెగలలో ఏ గిరిజన తెగకు లేని ప్రాంతీయ వ్యత్యాస రిజర్వేషన్ పద్దతి కేవలం వాల్మీకి మరియు నాయక్ అనే తెగలకు మాత్రమే ఎందుకని ఇది మన రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అని అదేవిధంగా ఇది అగ్రవర్ణ పాలకులు రాజకీయ కుట్రతో చేసిన అన్యాయం తప్ప మరొకటి కాదని , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా వాల్మీకి మరియు దాని ఉపకులాల రిజర్వేషన్ విషయంలో వారి హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని వాల్మీకులను గిరిజనలుగాను,మిగతా ఎనిమిది జిల్లాల్లో వున్న వాల్మీకులను BCల గాను విభజించి ఏ గిరిజన తెగకు లేని రిజర్వేషన్ పద్ధతిని వాల్మీకులకు మాత్రమే అమలు పరచి వారి రాజ్యాంగ హక్కులను మరియు వారి ఎదుగుదలను కాలరాస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ,అదేవిధంగా వృత్తి లేని వాల్మీకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పథకం అమలు చేయకుండా వాల్మీకులు పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని ఈ వివక్ష ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఈరాష్ట్ర ప్రభుత్వానికి మరియు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి తగిన బుద్ధి చెబుతామని వారు తెలియజేశారు. అదేవిధంగా 2019 ఎలక్షన్స్ ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కర్నూలు సభలో మైదాన ప్రాంత వాల్మీకులను బోయలంటాని వీరికి కూడా న్యాయం చేస్తామని మాట ఇచ్చారని అదే విధంగా వారు 2019 భారతీయ జనతా పార్టీ మానిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంత వాల్మీకి బోయలను కూడా గిరిజన జాబితాలోకి చేరుస్తాం అని వారి పార్టీ ఎలక్షన్ మానిఫెస్టో లో పొందుపరిచారని కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైదాన ప్రాంత వాల్మీకులకు ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే కేంద్ర ప్రభుత్వం వారి పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైదాన ప్రాంత వాల్మీకులను గిరిజనలగా గుర్తించేలా వారి రిజర్వేషన్ విషయంలో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి వారికి తగు న్యాయం జరిగేలా ఏజెన్సీ అనే పదాన్ని తొలగించాలని ఈ దిశగా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే గిరిజన చట్టంలో స్వల్ప మార్పు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైదాన ప్రాంత వాల్మీకులను కూడా గిరిజన జాబితాలోకి చేర్చే విధంగా తగిన చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైదాన ప్రాంత వాల్మీకులకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆలిండియా వాల్మీకి సమాజం జనరల్ సెక్రటరీ జక్కుల శ్రీనివాసరావు తీవ్రంగా హెచ్చరించారు*
Source: Taken from Jakkula Srinivasa Rao Whatsapp