Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APమేలుకో బోయవాడా మేలుకో..పోరాడితేనే సాధించగలం!
Venkateshwarlu BoyaHyderabad, India
Aug 26, 2021

బోయల్ని ఎస్టీలో చేర్చనందుకు నిరసనగా తీన్మార్ మల్లన్న యాత్రకు మద్దతు పలకనున్న వాల్మీకులు

-బోయలను ఎస్టీలుగా గుర్తింపు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్

-2017 April 16న అసెంబ్లీలో చెప్పిన మాటలను మరిచిన టీఆరెస్ ప్రభుత్వం

-దళిత రిటైర్డ్ ఐ ఏ ఎస్ డా. చెల్లప్ప కమీషన్ కు విలువ ఇవ్వని సీఎం

బోయల 60 ఏళ్ల డిమాండు ఎస్టీ హోదా సాధించాలని.. తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చి నట్టేట ముంచిందని తెలంగాణ బోయ సంఘాల నాయకులు తెలియజేసారు. బోయలకు కుల వృత్తి లేదని. అన్ని కులాలకు గొర్లు, బర్లు ఇస్తున్నారు. బోయలకు ఆలాంటి పథకాల అతి గతి లేదన్నారు.

తెలంగాణ జనాభా లో 2 శాతం ఉన్న బోయజాతిని విస్మరించడం పాలకులకు కొత్త కాదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పదవులకు బోయ జాతి ఆమడ దూరంలో ఉందని సంఘం సభ్యులు అంటున్నారు. ఎన్ని సార్లు, ఎంతమంది నాయకులకు విన్నవించుకున్నా బోయ జాతిని పట్టించుకున్న నాదుడు లేడని వాపోయారు.

ఆగస్టు 29న అలంపూర్ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న పాదయాత్రకు మద్దతు ఇచ్చి బోయలు నిరసన తెలుపాలని నిర్ణయించామన్నారు. ఆరోజు బోయ జాతి యువకులు, నాయకులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మల్లన్న పాదయాత్రకు దళితులకు బోయల మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పడానికి ఈ పాదయాత్రకు మద్దతు ఇస్తున్నామన్నారు తెలంగాణ బోయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ మీడియా కన్వీనర్ బోయ వేంకటేశ్వర్లు.

https://www.telanganajournalists.com/post/660578182630637568/%E0%B0%AC-%E0%B0%AF%E0%B0%B2-%E0%B0%A8-%E0%B0%8E%E0%B0%B8-%E0%B0%9F-%E0%B0%B2-%E0%B0%9A-%E0%B0%B0-%E0%B0%9A%E0%B0%A8-%E0%B0%A6-%E0%B0%95-%E0%B0%A8-%E0%B0%B0%E0%B0%B8%E0%B0%A8%E0%B0%97-%E0%B0%A4-%E0%B0%A8-%E0%B0%AE-%E0%B0%B

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X