Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APశివరాత్రి పండుగ-వాల్మీకి బోయలు

Venkateshwarlu BoyaHyderabad, India

Feb 24, 2017
భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు. పూర్వాశ్రమంలో తిన్నడు అనే బోయవాడు. చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తూ వేటాడి జీవనం సాగించేవాడు. ఒకనాడు అలా వేటాడుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది. అప్పటినుంచీ తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెడుతుండేవాడు.
ఒక సారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించ దలచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటినుంచి నీరు కార్చడం మొదలు పెట్టాడు. విగ్రహం కంటిలోనుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటినుంచి కూడా నీరు కారడం ఆరంభమైంది. కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు పూర్వ జన్మలో అర్జునుడు అనే (కిరాతార్జునీయం) ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.
తన కన్నును ఈశ్వరునికర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్పనాయనారు అయ్యాడు. నేత్రేశనాయనారు అనునది సంస్కృతనామము.
వాల్మీకి బోయల సత్యాగ్రహ దీక్ష
ప్రజలందరూ ఈరోజు శివరాత్రి పండుగ లో మునిగి తెలిపోతుంటారు. అందులో బోయలు కూడ మినహాయింపుమేమి కాదు. కాని బోయలు ఎన్నో వృత్తులు, ప్రవృత్తుల కారణంగా రాజులు రారాజులుగా ఎదిగిన గణ చరిత్ర బోయలది. ఇది గత చరిత్ర.
నేడు వాల్మీకి బోయలు కూడు,గూడు,గుడ్డ కరువై మనుగడ ఆత్మగౌరవం కొల్పోయి పరాయికరణ చెందుతూ సోమిరెడ్డి,వెంకటేశ్వరరావు,లక్ష్మినాయుడు తదితర పేర్లు పెట్టుకొని పరాయికణ చెందుతూ లేని హోదా ను అపాదించుకొనేవారు కొందరు అయితే మరికొందరు కులవృత్తి లేకా బ్రతుకు దేరువు లేక అస్థిత్వం కొల్పోయే క్రమంలో అనేక వృత్తులలో పరాయికరణ చేయబడ్డాయి. ఈక్రమంలో" వాల్మీకి బోయలు అర్ధ ఆకలితో బ్రతుకులు కొనసాగిస్తున్నారు.అందుకే వాల్మీకి బోయలకు బ్రతుకంతా శివరాత్రే". దీనికి కారణం ఎమిటి ? కారకులు ఎవరు అని ఆలోచించాల్సిన అవసరం ఎంత అయినా ఉంది.
1956 సంవత్సరం వరకు షెడ్డ్యూల్డ్ ట్రైబ్స్ జాబితా లో ఉన్నాం.కానీ నీలం సంజీవరెడ్డి కుట్ర పలితంగా బోయలు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోBC 'A' జాబితా లోకి చెర్చబడినది.తెలంగాణ డా!!చెల్లప్ప కమీషన్ వేసి రిపోర్ట్ స్వీకరించి నప్పటికి 2017 జనవరి31 వరకు పొడగించారు. కారణం కాలయాపన కోసం అనేది వాస్తవం. ఈస్థితిలో వాల్మీకి బోయలు మరో తరం పోరాటం చేయక తప్పని పరిస్థితి.
ఇందుకోసం సోమవారం (27-02-2017) ఇందిరా పార్క్ హైదరాబాదు యందు TVBSJAC చేపట్టిన "వాల్మీకి బోయల సత్యాగ్రహం" దీక్షను జయప్రదం చెయ్యాలని పిలుపు నిచ్చింది. ఈకార్యక్రమం ఇంటికి ఒకరు ఊరికి ఒక వాహనం చొప్పున బయలుదేరి కార్యక్రమం విజయవంతం చెయ్యాలనీ పిలుపునిచ్చింది.
మార్చిలో జరగున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే బోయలను ఎస్టీలో కలపడానికి వేసిన డా!! చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ ను శాసనసభ లో ఆమోదించి పార్లమెంటు కు పంపాలని డిమాండ్. ఇప్పుడు ఈపక్రియ కొనసాగక పోతే బోయలకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితా లో చేరడం కలగానే మిగులు తుంది.అప్పుడు "వాల్మీకి బోయ లు బ్రతుకంతా శివరాత్రి గానే కొనసాగించాల్సి వస్తుంది. అందుకు మనం మన లక్ష్యం కోసం" కదం తొక్కుతూ కదులు తున్నరన్నా వాల్మీకి బోయలు.. అధికారులు,పాలకుల గుండెలు అదిరేలా" అనే విదంగా దిక్కులు పికటిల్లే బోయ ప్రజలు కదలాలనీ పిలుపు నిస్తున్నాం.
~కొంకల వెంకట్ నారాయణ,
రాష్ట్రాద్యక్షులు బోయహక్కుల పోరాట సమితి BHPS (విల్లంబ్బుదెబ్బ)
Telangana Valmiki Boya Sanghala JAC, STATE Co-Convenor, Telangana
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X