Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP"తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైందో.. ఎస్టీ సాధన కోసం జరుగుతున్న వాల్మీకి బోయల అంతిమ పోరాటం కూడా అంతే"

Venkateshwarlu BoyaHyderabad, India

Jan 30, 2017
మిత్రులందరికీ నమస్కారం! "ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బోయ జాతిలో సృంష్టించిన ప్రాంతీయ విభేదాలు తొలగించి వాల్మీకి బోయలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా గుర్తించాలి" అనేది ఇండియా వ్యాప్తంగా ఉన్న నినాదం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బోయల ఉద్యమం ఉధృతం కావడం ఖాయం.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్ రాష్ట్రాలలో SC జాబితాలోనూ తూర్పు ఈశాన్య రాష్ట్రలలో కర్ణాటక లలో ST జాబితా లో ఇండియా ప్రభుత్వం చెర్చింది.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరం ,విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని వాల్మీకి బోయ లనూ ST లుగా,తెలంగాణ లోనీ భద్రాచలం ప్రాంతంలో STజాబితాలో ఉన్నారు.
నిజాం పాలిత హైదరాబాదు రాష్ట్రం లో 1956 సంవత్సరం కు ముందు వాల్మీకి బోయ లు గిరిజనులు గా ఉన్నారు. వాస్తవానికి విరుద్ధంగా నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కుట్ర పలితంగా బోయలు BC'A' జాభితా లోకి నెట్టబడ్డారు అనేది చారిత్రిక సత్యం.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బోయలు అదికంగా ఉండటం మూలంగా అక్టోబర్ 16-2007 నాటి TRS పార్టీ అధినేత నేటి తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి KCR గారు వనపర్తి బహిరంగ సభలో మేము అధికారం లో కి వస్తే వాల్మీకి బోయ లను ST లు గుర్తిస్తూ మొదటి సంతకం పెడుతాననీ పెర్కోన్నారు.ఎన్నికల మానిపెస్టోలో పెట్టారు. అధికారం లోకి వచ్చిన తర్వాత చెల్లప్ప కమిషన్ వేసి రెండు పర్యాయాలు కమీషన్ గడువు పెంచారు. అధ్యయనం పూర్తి కాలేదని..కమీషన్ మధ్యంతర నివేదిక సమర్పించిన తర్వాత కూడా చెల్లప్ప కమీషన్ గడువును మళ్లీ పెంచారు. దీనికి కారణాలేంటో బోయలకు అర్థంకాక ప్రభుత్వం పట్ల విశ్వాసం తో ఉంటే బోయలు పఫ్పులో కాలు వెసినట్లే.
"గొర్రె కసాయినీ నమ్మిన చందాంగా ఉంటుంది బోయల బ్రమలు.".ఈసారి చెల్లప్ప కమీషన్ గడువు కాలం ఎకంగా జనవరి 31-2018 వరకు పెంచారు.ఇంతవరకు చెల్లప్ప కమీషన్ రిపోర్ట్ పై శాసనసభ లోగానీ క్యాబినెట్ లో గానీ ఎలాంటి చర్చలేదన్న మాట. అంటే 2018 సంవత్సరం నుంచ్చే ఎన్నికల వాతావరణం సర్పంచ్, MPTC, ZPTC, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల కోడ్ ల పేరా బిల్లులు పెట్టే అవకాశం లేదని చెప్పడానికా?
శాసనసభ లో తీర్మానం చేసి పంపడానికి బోయల ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఆడుకుంటే..కబద్దార్ కేసీఆర్ ! మీ సర్కార్ కు చరమగీతం పాడాల్సి వస్తుంది. దళిత, బహుజన, దళాలతో ఏకమై నీ అంతు చూస్తాం.. తప్ప వేరే కాదు అన్నవిషయం కేసీఆర్ గుర్తించుకోవాలి. ఈ వాస్తవాన్ని బోయలు గుర్తించి ఉద్యమానికి సన్నిద్దం కావాలి.
"వాల్మీకి బోయల ST సాధన..మన కనీస హక్కు.. సామాజిక న్యాయం మన జన్మ హక్కు"అని నినదిస్తూ గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ A,B,C,D లుగా వర్గీకరణ చెయ్యాలి. అప్పుడే అదివాసిలకు,గోండులకు,చెంచుల తో పాటు అనేక తెగలకు కొంత వరకైనా నాయ్యం జరుగుతుంది. ఈవాస్తవాన్ని గమనించి గిరిజన రిజర్వేషన్లు జనభా ప్రాతిపదికన అమలు చెయ్యాలని డిమాండ్ చెయ్యాలి. లేకపోతే కమీషన్ పేర కాలయాపన జరగటం తోపాటు అదివాసీలు గిరిజన రిజర్వేషన్లు నుంచి లంబాడోళ్ళ ను తొలగింపు చెయ్యాలనీ డిమాండ్ చేస్తుంటే ,లంబాడోళ్ళు బోయలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితా లో చెర్చవద్దనీ వివిధ సామాజిక మాధ్యమాలలో సంఘర్షణలు కల్పించి అగ్రకుల పాలకులు తమపనులు తాము చెసుకుంటూ పోతున్నారు. ఈ వాస్తవాన్ని బోయలు గానీ మిగతా తెగల సముహాలు ఏమి చెయాలో అలొచించుకోవాలి.
- కొంకల వెంకట్ నారాయణ (బోయ హక్కుల పోరాట సమితి(విల్లంబ్బు దెబ్బ) BHPS, రాష్ట్రాద్యక్షులు ,సామాజిక తెలంగాణ మహాసభ,TVBSJAC)
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X