Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APకేసీఆర్ చర్యతో బోయజాతి గుండె పగిలింది: తెలంగాణ వాల్మీకి బోయ యువ రక్తం ఆవేదన
Venkateshwarlu BoyaHyderabad, India
Jan 29, 2017
తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ బోయలను ఎలా మోసం చేస్తుందో చూడండని ఓ వాల్మీకి ముద్దు బిడ్డ.. గద్వాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆవేదన ఇది. చూడండి బ్రదర్! 2018 లో ఎలక్షన్స్ మొదలు అవతయూ,మాలి 2019 లో మన పార్టీ(తెరాస) అభ్యర్ధిని గెలిపించండి బోయాలను ST లో కలుపుతాను అని అంటాడు, జరగబోయాది ఇది ఆహ్ . 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బోయల జనాభా 3,50000,Mahabubnagar జిల్లాలో 2,50000 బోయాలు ఉన్నారు, జిల్లాల విభజన తరువాత అధికంగా వనపర్తి మరియు జోగులంబ గద్వాల్ జిల్లాలో బోయలు ఉన్నారు,మొదట ఉద్యమం ఈ జిల్లాలోనే మొదలు అవ్వాలి, కెసిఆర్ గారు వనపర్తిలో బోయలు ఎక్కువగా ఉన్నారు, బోయాలును ST చేస్తాను అని హామీ ఇచ్చారు,అది కూడా ఎలక్షన్లో తన మిత్రుడు నిరంజన్ రెడ్డి ని గెలిపించమని కోరారు. మళ్లీ అదే సీను 2019 లో రాబోతుంది. అది ఈరోజు అర్థం అయిపోయింది,బోయాలకు ST కేవలం ఒక ఎలక్షన్ స్టంట్ మాత్రమే,ఇది అదునుగా చూసుకుని కుల రాజకీయం మొదలు పెట్టారు, ఆహా ఆ హంగామానే వేరు లెండి,కానీ ఉద్యమం జరగకుండా.. మానని మాయమాటలతో ఎప్పటికప్పుడు మోసం చేస్తున్నది ఎవరు ? ప్రభుత్వం నుంచి G.O వస్తది చెల్లప కమిటి డేట్ ఎక్స్టెండ్ చేసారు అని, వాల్మీకి జయంతి కార్యక్రమంలో హంగామా చేశారు నాయకులు..ఇప్పుడు సైలెంట్గా ఉన్నారెందుకు? కేసీఆర్ మాట మీద నిలబడతారు అని ఆహా ఒహో అని గొప్పలు చెప్పారు.. పేపర్ ప్రకటన ఇచ్చారు… ఇప్పుడు తెలిసిందా? ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారో.. ఇక్కడ ,తల్లీ పాలు తాగి..తల్లి రొమ్ముపైనే గుదుతున్నది ఎవరు? బోయ సంఘాలకు పెద్ద అని చెప్పుకొనే నాయకులు.. మొదటి సారి చెల్లప కమిటి డేట్ ఎక్స్టెండ్ చేసిన రోజే ఉద్యమం మొదలు పెట్టినట్టు అయితే ఈరోజుకి మనం ST జాబితాలో ఉండేవాళ్లం కాదా? సోదరులారా ….ఇపటికీ మించి పోయినది ఏం లేదు, బోయల అంతిమ పోరాటానికి నేను సిద్ధం.. ఉద్యమం వైపు అడుగులు వేస్తామని ఎంత మంది నాతో వస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు నాకు పర్సనలగా మెసేజ్ పెట్టండి.. మీ పేరు మరియు వివరాలు పంపండి….ఎవరో వస్తారని ఎదురు చూడడం కంటే మన యువతే పోరాడటం మంచింది. మన భవిష్యత్తుకోసం మనమే పోరాడుదాం. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోకపోతే ఈ నాయకులు, ప్రభుత్వాలు మాట వినరు. మన జాతి చాలా ప్రమాదంలో ఉంది, కొంత మంది వరంగల్ జిల్లాలో ముదిరాజు ల్లోకి మారిపోతున్నారు,ఇది ఇలాగే కొనసాగితే బోయ అనే ఒక జాతి ఉండేదని చెప్పుకునే పరిస్థితి వస్తుంది బ్రదర్స్. మేలుకోండి. నాతో కలిసి రండి!
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X