Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APబోయ నాయకుల్లారా ఇక నైనా నిద్ర లేవండి? పోరుబాట పడదాం పదండి!
Venkateshwarlu BoyaHyderabad, India
28 Jan 2017
మన జాతిని కాపాడే ఉద్ధ్యేశం అసలు మీకుందా? అదే ఉంటే జాతి బాగుపడాలనుకునే అసలు సిసలు బోయ సంఘ నాయకులు చెల్లప్ప కమిషన్ గడువును మొదటి సారి పెంచినప్పుడే ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది. రెండో సారి హెచ్చరించాల్సింది. మూడోసారి పోరుబాట పట్టాల్సింది. ఇక వద్దులే.. నాలుగైదుసార్లు సార్లు పెంచినా కూడా..నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని.. బోయ జాతి నాయకులమని చెప్పి మహర్షి వాల్మీకి జయంతి నిధులకోసమే అన్నట్టుగా అవి తమకే చెందినట్టుగా చెలామణి అయ్యే సోమరుల్లారా..ఇప్పుడైనా కళ్లు తెరవండి.. జాతి కోసం మీరు పోరాడితే ఇప్పటికే ఉద్యమం ఉధృతంగా ఉండేది. ప్రభుత్వం బోయలను ఎస్టీలో చేర్చడానికి శీతాకాల సమావేశాల్లోనే బిల్లుపెట్టే వాళ్లు. మీరు గంగిరెద్దులా తల ఊపుకుంటూ పోతే..జాతికి మిగిలేది బూడిదే..మనకు కావాల్సింది క్యాలెండర్లో, వాటి మీద ఫోటోలో, పదవులో కాదు..బోయ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే..ఎస్టీ సాధన అసలైన లక్ష్యం కావాలి. మీరు మారరు..! దున్నపోతు మీద వర్షం పడితే మాకేంటి ..ముఖం మీద ఉమ్మితే నాకేంటి నా కడుపు నిండితే చాలనుకునే దొంగ నాయకులు..మీ వల్ల జాతి ఇప్పటికే కాదు ఎప్పటికీ బాగు పడదు. ఓయువతా ఇకనైనా మేలుకోండి..మన జాతి ఉద్యమాన్ని పోరుబాటగా మార్చండి. బోయల అంతిమ పోరాటానికి సిద్దంకండి..జై వాల్మీకి.. నోట్: 2016 అక్టోబర్ 27 న జరిగిన వాల్మీకి జయంతి నిధులను స్వాహా..ఎవరి జేబుల్లోకి ఎంత వెల్లిందంటే.. 1. ఎస్ లక్ష్మినారాయణ (ఐక్య వాల్మీకి బోయ సంఘం నాయకుడు, మహబూబ్ నగర్)- అక్షరాల 2 లక్షల రూపాయలు, 2. గట్టు తిమ్మప్ప ( రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నాయకుడు గద్వాల)- రూ. 1.5 లక్షలు 3. మీనుగ గోపి (బోయ హక్కుల పోరాట సమితి-హైదరాబాద)- రూ. 80 వేలు etc...
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X