Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
బోయల షెడ్యూల్డ్ కులాల గుర్తింపును (రిజర్వేషన్) తిరిగి పున:రుద్ధరించాలి

Venkateshwarlu BoyaHyderabad, India

16 ene 2017
మంగళవారం జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చకు రాబోతున్న ఎస్టీ రిజర్వేషన్ లో బోయలను ఎస్టీలో చేర్చేందుకు తీర్మానం చేయాలని తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయలు డిమాండ్ చేస్తున్నారు. జనవరి ఆరో తేదీన మొదలైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈనెల 17కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మొదటి రోజునుంచే రోజోక అంశంపై చర్చించింది. శాసనసభతో పాటు శాసనమండలి సమావేశాలు మంగళవారం ప్రారంభమవుతాయి.
మంగళవారం ప్రశ్నోత్తరాల తర్వాత హైదరాబాద్ మహా నగర అభివృద్దిపై శాసనసభలో ప్రత్యేక చర్చ జరగనుంది. శాసన మండలిలో మైనార్టీ ల సంక్షేమం పై చర్చించనున్నారు సభ్యులు. ఇక ఇదే సెషన్ లో గిరిజన రిజర్వేషన్ బిల్లు ను సభలో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. వాల్మీకి బోయ, ఖైయితి లంబాడాలను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చి.. గిరిజనులకు రిజర్వేషన్ ను 12 శాతానికి పెంచుతామని గతంలో సీఎం ఇచ్చిన హామీమేరకు ఈ బిల్లుపై తీర్మానం చేసి పార్లమెంట్ పంపాలన్న యోచనలో ఉంది సర్కార్.
ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని చట్ట సవరణలు కూడా ప్రవేశపెట్టనుంది. ప్రతిపక్షాలు కోరితే మరిన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉంది ప్రభత్వం.
Source: http://telugu.v6news.tv/%E0%B0%85%E0%B0%B8%E0%B1%86%E0%B0%82%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80-%E0%B0%AE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80-%E0%B0%B7%E0%B1%81%E0%B0%B0%E0%B1%82
Apoyar ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
X
Email