Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

బోయలను ఎస్టీలో కలుపుతారా లేదా సీఎం సారూ!

Venkateshwarlu BoyaHyderabad, India
Dec 29, 2016
కిషన్ రెడ్డి సర్ (బీజేపీ ఎమ్ ఎల్ ఏ) ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటున్నారు గాని బోయలను ఎస్టీలో కలుపుతారా లేదా అన్న విషయం గురించి సీఎం కేసీఆర్ ప్రకటించలేదు. చెల్లప్ప కమిటీ రిపోర్టు ఇచ్చింది. అయినా నాలుగు సార్లు కాలపరిమితిని పొడిగించారు. కమిటీ అందించిన వివరాలు ఇప్పటికీ వెల్లడి చేయలేదు. నిన్న క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడినప్పుడు కూడా బోయల గురించి మాటరాలేదు. కాస్త మాతరపున అడగండి సర్ పుణ్యముంటది. నాపేరు వెంకటేశ్వర్లు బోయ, ఉస్మానియా జర్నలిజం స్టుడెంట్ ని. మీ అభిమానిని. మా బోయ జాతికి మేలు చేయండి సర్. కడు పేదలు మా వాళ్లు. అసెంబ్లీలో మా వాయిస్ వినిపించండి సర్. ధన్యవాదాలు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతుండగా సార్ ఫోన్ కి మెసేజ్ పెట్టా..రిప్లై కూడా ఇవ్వలేదు. సార్ కు బోయల్ని ఎస్టీలో కలపడం ఇష్టం లేదేమో మరి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలే. మా నాయకుడంటూ లేడు. ఉన్నవాళ్లు నోరు మెదపరాయే. బోయలను ఎస్టీలో కలుపుతానని రెెండున్నరేళ్ల కిందట చెప్పిండు కేసీఆర్ సారు..ఎస్టీల రిజర్వేషన్ అంటుండుగానీ..అందులో బోయలున్నారా లేదా చెప్పడం లేదు. అందుకే డౌటొస్తోంది. ఎందుకైనా మంచిదని కిషన్ రెడ్డి సార్ ని గోకినా..పని కాలే.. ఎవర్నీ పట్టు కోవాలబ్బా ఈ సారి..ఆర్ కృష్ణయ్యను పట్టుకుంటా.. మరేం చేద్దాం సారూ.. చెల్లప్ప చెప్పడు. కేసీఆర్ నోటి వెంట బోయల మాటేరాదేయే మా వాయిస్ వినిపించే నాథుడే లేడు. మాకు కాస్త సీఎం అపాయింట్ మెంట్ ఇప్పించండి సార్..ఎవరైనా పుణ్యముంటది. ఇట్లు బోయజాతి పాలమూరు బిడ్డ వెంకటేశ్వర్లు బోయ.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X