Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APతెలంగాణ రాష్ట్రంలో ఒకే కులంలో గల ప్రాంతీయవ్యత్యాసాలు తొల‌గించండి మ‌హాప్ర‌భో?
Venkateshwarlu BoyaHyderabad, India
11 Mar 2016
వాల్మీకి బోయ‌లు, ఖాయితీ లంబాడాల‌ను ఎస్టీ జాబితాలో చేర్చ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం జీవో నంబ‌ర్ 5 ను తీసుకువ‌చ్చి ముగ్గురు స‌భ్యులు గ‌ల ఎస్టీ క‌మీష‌న్నువేసింది. టీ ఆర్ ఎస్ పార్టీ నాయ‌కుడుగా కేసీఆర్ ఆనాడు జ‌రిగిన సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల‌కు ముందు మ‌హాబూబ్ న‌గ‌ర్ జిల్లా గ‌ద్వాల కోట సాక్షిగా.. వాల్మీకి బోయ‌ల‌కు ఇచ్చిన హామిని నెర‌వేర్చ‌డానికి చెల్ల‌ప్ప క‌మీష‌న్ను వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క‌మిటీ అధ్య‌య‌నం చేసి 6 నెలల్లో నివేదిక ఇవ్వ‌మని గ‌తేడాది మార్చి 3న డా. చెల్ల‌ప్ప (ఐఏస్ రిటైర్డ్) చైర్మ‌న్ గా, కే జ‌గ‌న్నాథ్ రావ్ (ఐపీఎస్ రిటైర్డ్) హెచ్ కే నాగు (మాజీ అడిష‌న‌ల్ లేబ‌ర్ క‌మీషన‌ర్)లు గ‌ల స‌భ్యుల‌తో క‌మీష‌న్నువేసింది. అయితే ఇచ్చిన 6 నెల‌లు కాద‌ని మ‌రో 6నెల‌ల గ‌డువు క‌మీష‌న్ అడుగ‌గా ప్ర‌భుత్వం అంగీక‌రించింది. మరి ఆ ఆగ‌డువు కూడా అయిపోయింది. ఈ యేడాది మార్చి 3కి సంవ‌త్స‌రం గ‌డుస్తున్నా ఇంత‌వ‌ర‌కు క‌మీష‌న్ నివేదిక గురించి ఎలాంటి స‌మాచారం లేదు. అస‌లు ఇస్తుందా? ఇస్తే ఎప్పుడు? అందులో ఏమి చెప్ప‌నున్నారు అని అనేక వ‌ర్గాలు ఎదురు చూస్తున్నాయి. వాల్మీకి బోయ‌లు వేయి క‌ళ్ల‌తో చెల్ల‌ప్ప ఇచ్చే నివేదిక త‌మ జీవితాల‌ను మార్చేస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు. బోయ‌లు కుల వృత్తిలేక‌, ఉద్యోగాలు లేక‌, వ్య‌వ‌సాయ భూములులేక, ఆర్థికంగా చిన్నాభిన్న‌మై దుర్భ‌ర జీవ‌నాన్నిగ‌డుపుతున్న సంగ‌తి గ‌త యేడాది నుంచి తెలంగాణ ప‌ది జిల్లాల్లో అధ్య‌య‌నం చేస్తున్న క‌మిటీ స‌భ్యుల‌కు తెలియ‌న్ది కాదు. క‌నీసం ఇప్పుడైనా చెల్ల‌ప్ప క‌మిటీ నివేదిక ఇస్తే ఈ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవ‌కాశం ఉంది. క‌మిటీ నివేదిక ఇంకా ఆల‌స్యమ‌యితే ప్ర‌భుత్వమే వాల్మీకి బోయ‌ల‌కిచ్చిన హామిని మ‌ర‌చి కాల‌యాప‌న చేస్తున్న‌ట్టే అనుకోవాల్సి ఉంటుంది. కావున ఎస్టీ క‌మీష‌న్ స‌భ్యులు వీలైనంత త్వ‌ర‌గా నివేదిక‌ను ఈ యేడాదే త‌మ‌కు అనుకూలంగా ప్ర‌భుత్వానికి ఇస్తార‌ని రాష్ట్ర వ్యావ్తంగా ఉన్న‌ 3.5 ల‌క్ష‌ల వాల్మీకి బోయ‌లు ఆశిస్తున్నారు. ఇట్లు వెంక‌టేశ్వ‌ర్లు బోయ(తెలంగాణ జ‌ర్న‌లిస్టు)
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X