ఘంటసాల గారికి భారతరత్న: సంతకాల సేకరణ

The Issue

శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి భారతరత్న పురస్కారం:

గౌరవనీయులైన భారత రాష్ట్రపతి వర్యులకు మరియు ప్రధాన మంత్రి వర్యులకు, నమస్కారం 

శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా, భారత సంగీత రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గానూ మరణానంతరం భారతరత్న పురస్కారంతో గుర్తించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలలో నివశించేవారే కాకుండా ప్రపంచం నలుమూలలా ఉన్న 15 కోట్ల మంది తెలుగు మాట్లాడే ప్రజలు కోరుకుంటున్నారు.

శ్రీ ఘంటసాల గారు ఒక లెజెండరీ వ్యక్తి,. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందినది మరియు వారి దివ్యమైన స్వరాన్ని ప్రతిబింబిస్తుంది, ఇది భారతదేశంలో అత్యధికంగా వినబడే రికార్డింగ్‌లలో ఎప్పటికీ ఒకటి.

ఘంటసాల గారి గురుంచి కొన్ని వివరాలు క్లుప్తంగా:

1. అమరగాయకుడుగా మరియు సంగీత దర్శకుడుగా 10,000 పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మరియు తులు బాషలలో పాటలుతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ కి (పుష్ప విలాపం, కుంతీ విలాపం, దేశభక్తి గీతాలు) పాడటం మరియు వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత.

2. సంగీత దర్శకుడుగా 110 కంటే ఎక్కువ సినిమాలుకు సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాలాంటి పాటలను అందించారు.

3. వాగ్గేయకారుడుగా పాటలను రచించి, సంగీత స్వర కల్పన కూర్చి మరియు వారి అమృత గాత్రంతో  ఆ పాటలకు జీవం పోశారు. ఉదాహరణకు బహుదూరపు బాటసారి, ఇటు రావోయి ఒక్కసారి మొదలగు పాటలు... అలాగే 15 వ శతాభ్దం అన్నమయ్య తరువాత తిరుపతి దేవషానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గంధర్వ గాయకుడు.

4. పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా (1942 Quit India Movement) 18 నెలల జైలు శిక్షని అనుభవించారు, అనేక దేశభక్తి గీతాలను పాడి ప్రజలను భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడానికి వారిని ప్రేరేపించారు. స్వాతంత్య్రానంతరం ఈ పాటలను అధికారికంగా రికార్డ్ చేయడం వలన అవి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

5. భారత ప్రభుత్వం 1970లో శ్రీ ఘంటసాలని పద్మశ్రీతో గుర్తించింది. 2003లో ఆయన గౌరవార్థం ఒక తపాలా బిళ్ళను విడుదల చేశారు. భారత ప్రభుత్వం ప్రచురించిన (Sons of Soil) పుస్తకములో ఘంటసాల గారి పేరు కూడా చేర్చడం ఆయన దేశభక్తికి (Quit India Movement) నిదర్శనం.

ఈ సంవత్సరం ఆయన శతజయంతి వేడుకలు జరుపుకుంటున్నందున, ఆయన చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా ఇప్పుడు ఆయనను భారతరత్నతో  పురస్కరించి గౌరవించడం ఇదే ఉత్తమ ఘననివాళి.

ప్రపంచం నలుమూలల నుండి అనేక తెలుగు సంఘాలు 140 టీవీ చర్చ కార్యక్రమాలలో (జూమ్ మాధ్యమం ద్వారా) పాల్గొని ఈ ఉదాత్తమైన కార్యక్రమాన్ని బేషరతుగా మద్దతునిస్తున్నారు.

ఇప్పటివరకు 33 దేశాలకుపైగా తెలుగు సంస్థలు వాటి అధ్యక్షులు, కార్యవర్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు, ఆ దేశ వివరాలు మీకోసం:

1. అమెరికా 
2. భారతదేశం
3. సింగపూర్
4. న్యూజీలాండ్
5. ఇండోనేషియా
6. హాంగ్ కాంగ్
7. థాయిలాండ్
8. కెనడా
9. బెహ్రెయిన్
10. ఫ్రాన్స్
11. ఆస్ట్రేలియా
12. మలేషియా
13. యూఏఈ
14. ఖతార్
15. ఒమాన్
16. సౌదీఅరేబియా
17. నార్వే
18. లండన్ యునైటెడ్ కింగ్డమ్
19. డెన్మార్క్
20. బ్రూనై
21. హంగేరీ
22. ఉగాండా
23. మారిషస్
24. బోత్సవాన
25. దక్షిణాఫ్రిక
26. స్విట్జర్లాండ్
27. స్కాట్లాండ్ యునైటెడ్ కింగ్డమ్
28. ఫ్రాన్స్
29. ఐర్లాండు
30. జపాన్
31. నెదర్ ల్యాండ్సు
32. తైవాన్
33. జర్మని

avatar of the starter
BharatRatna for GhantasalaPetition Starterశతాబ్ది గాయకుడు ఘంటసాలకు ఘననీయంగా నివాళి. <a href="https://telugu.greatandhra.com/articles/special-articles/tribute-to-the-gantasala-145955.html" rel="nofollow">https://telugu.greatandhra.com/articles/special-articles/tribute-to-the-gantasala-145955.html</a>
This petition had 7,366 supporters

Petition Updates