#SaveAPMedicalColleges @AndhraPradeshCM @APDeputyCMO @naralokesh @satyakumar_y @ysjagan

Recent signers:
Pulagura Lokesh Reddy and 19 others have signed recently.

The Issue

 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రజల ఆస్తి – ప్రైవేట్  సంస్ధల లాభం కోసం కాదు!

జగన్ గారి హయాంలో నిర్మాణం పూర్తిచేసినవి మరియు వివిధ దశల్లో కొనసాగుతున్న 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) మోడల్ ద్వారా ప్రైవేటీకరించాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం ప్రారంభించడం అందరికీ తెలిసిందే.

  • జగన్ గారు అధికారంలోకి వచ్చిన తరువాత 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారు.
  • రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్టణం, విజయనగరం, ఏలూరు కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరం నుండి ప్రతి కళాశాలలో 150 సీట్లు,
    పాడేరు మెడికల్ కాలేజీ లో 2024–25 నుండి 50 సీట్లు అనుమతించబడ్డాయి.
  • పులివెందుల, పిడుగురాళ్ల కళాశాలల్లో Letter of Permission ఆలస్యమై అడ్మిషన్లు జరగలేదు. అయినప్పటికీ నిర్మాణం ఎక్కువ భాగం పూర్తయింది.

జగన్ గారి హయాములో 2020 - 2021 Covid 19 వలన సుమారు సంవత్సరంన్నర పైగా నిర్మాణ పనులులో జాప్యం జరిగింది. అయినప్పటికీ 8 ప్రభుత్వ కాలేజీలు నిర్మించడాన్ని పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాల్సింది పోయి, 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను PPP మోడల్ లో కట్టాలని నిర్ణయించారు.

ఆ 10 కళాశాలలు: ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం.

  • మొదటిగా ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల కళాశాలలను PPP మోడల్‌లో టెండర్లు పిలిచారు.
  • తరువాత మిగిలిన ఆరు కాలేజీలకూ RFP సిద్ధమయ్యాక టెండర్లు పిలుస్తామని ప్రకటించారు.
  • ఈ నిర్ణయానికి సంబంధించిన G.O.Rt.No.590, తేదీ: 09.09.2025 జారీ చేశారు.

వైఎస్ జగన్ గారి ప్రభుత్వం 19th July, 2023 న ఇచ్చిన GO 107 & 108 ప్రకారం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటా సీట్లలో 50% ను ప్రైవేట్ కేటగిరీలకు కేటాయించారు:

  • కన్వీనర్ కోటాలో జనరల్ కేటగిరీ విద్యార్థులు సంవత్సరానికి చెల్లించవలసిన ఫీజు  ₹15,000
  • సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ – 35% - సంవత్సరానికి ₹12,00,000 ఫీజు
  • NRI కేటగిరీ – 15% - సంవత్సరానికి ₹20,00,000 ఫీజు
    👉 ఈ రెండు కేటగిరీలలో రిజర్వేషన్ పాలసీ వర్తించదు.

GO 107, 108లోని కొన్ని నిబంధనల వలన మెరిట్ మరియు రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులు నష్టపోతున్న అంశం వాస్తవమే. కానీ, GO 108లో స్పష్టంగా పేర్కొన్నట్లు, Self-Finance మరియు NRI కేటగిరీ విద్యార్థులు చెల్లించిన ఫీజులు మొత్తం ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMERCL) కు బదిలీ చేయబడతాయి. 

ఈ నిధులను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరియు వాటి అనుబంధ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలను కల్పించడానికి వినియోగించాలన్న ఉద్దేశాన్ని ప్రభుత్వం GO 108లో స్పష్టంగా వ్యక్తం చేసింది. అదేవిధంగా, APMERCL ను ఏర్పాటు చేసే విధంగా G.O.Ms.No.9, తేదీ: 02.02.2021 కూడా జారీ చేయబడింది.

వైద్య విద్యార్థులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు తీవ్రంగా ఖండించి ఈ GO లను రద్దు చేయవలసినదిగా అనేక ఉద్యమాలు చేసాయి.

ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడిన తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ కళాశాలలలొ  వైద్య విద్య చదువుకోవాలి అని ఆశిస్తున్న ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్న గత ప్రభుత్వం ఇచ్చిన  GO 107, 108 లను తమ  కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో రద్దు చేస్తామని నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు విద్యార్థులకు వాగ్దానం చేశారు. 

GO 107, 108 లను తమ కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో రద్దు చేస్తామని వాగ్దానం చేసిన  తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు  ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను PPP మోడల్ లో కట్టడానికి నిర్ణయం తీసుకుని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

జగన్ గారి హయాములో ఇచ్చిన GO 107,108 వలన  జరిగే అన్యాయం కంటే ఆరోగ్య విద్య, వైద్య రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) వలన ఇంకా ఎన్నో రెట్ల అన్యాయం ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు జరుగుతుంది.

కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీసుకుని వస్తున్న  PPP మోడల్ కింద  ఫీజు ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి:

  • అల్ ఇండియా కోటా 15 % / స్టేట్ కోటా (35%) – సంవత్సరానికి చెల్లించవలసిన ఫీజు  ₹15,000
  • మేనేజ్‌మెంట్ కోటా (35%) – సంవత్సరానికి చెల్లించవలసిన ఫీజు ₹9,93,600
  • NRI కోటా (15%) – సంవత్సరానికి చెల్లించవలసిన ఫీజు ₹57,50,000

🏥 ఆసుపత్రి సేవలు కూడా ప్రభావితం అవుతాయి
70% బెడ్లు – PMJAY/NTRVST/CGHS కింద
30% బెడ్లు – మార్కెట్ రేట్లకు
ఇది పేద ప్రజలకు ఆసుపత్రి సేవలను కూడా ఖరీదైనవిగా మారుస్తుంది.

ఆరోగ్య, వైద్య విద్య రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ అమలు అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో భవిష్యత్తులో వైద్య విద్య మరియు ఆస్పత్రుల నిర్వహణ ప్రైవేట్ పరం అయ్యే అవకాశాలున్నాయి.

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) మోడల్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అమలు చేస్తే మన రాష్ట్రములో ఎంతమంది ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ ఫీజు లు కట్టే స్తొమత ఉంటుందో కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఫీజు రీయింబర్సుమెంట్, రిజర్వేషన్ పాలసీ లు వర్తించని ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ మోడల్ ఎలా ప్రతిభ కలిగిన పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులుకు మేలు చేస్తుందో కూడా ప్రభుత్వం పునరాలోచించాలి.

PPP మోడల్ – DBFOT ఫ్రేమ్‌వర్క్

PPP మోడల్ Design-Build-Finance-Operate-Transfer (DBFOT) ద్వారా, ప్రతి కాలేజీ కింద:

  • 150 MBBS సీట్లు
  • 24 PG సీట్లు
  • 625 పడకల ఆసుపత్రి నిర్మాణం
  • ఈ ప్రాజెక్ట్ కోసం అర్హత సాధించిన సంస్థకు, ప్రభుత్వ భూభాగం ఎకరం కేవలం ₹100 కు 33+33 = 66 సంవత్సరాల లీజు ఇచ్చేలా నియమాలు రూపొందించబడ్డాయి.

ఈ నియమాలు మరియు, వివరాలు Draft Concession Agreement, Request for Proposal (RFP), Schedules to the Draft Concession Agreement మరియు ఇతరత్రా సమాచారం ఈ కింది లింక్స్ లో వున్నవి.

  • పులివెందుల కాలేజీ మిగిలిన పనులకు – ₹168.37 కోట్లు
  • మదనపల్లి – ₹446.28 కోట్లు
  • మార్కాపురం – ₹440.28 కోట్లు
  • ఆదోని – ₹410.32 కోట్లు
  • కూటమి ప్రభుత్వం చెప్తున్నట్లుగా పది మెడికల్ కాలేజీలు  (1 ఆదోని, 2 మదనపల్లి, 3 మార్కాపురం, 4 పులివెందుల, 5 పెనుకొండ, 6 పాలకొల్లు, 7 అమలాపురం, 8 నర్సీపట్నం, 9 బాపట్ల,10 పార్వతీపురం)  PPP మోడల్ లో నిర్మించడానికి అభివృద్ధి చేయడానికి ఒక్కొక్క కాలేజీ కి సుమారు 400 నుంచి 500 కోట్ల రూపాయల వరకు మొత్తంగా 5000 నుంచి 6000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 

వైద్య విద్యార్థుల భవిష్యత్తుని, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు పొందుకునే పేద, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టకుని ప్రభుత్వ వైద్య కళాశాలలను PPP మోడల్ లో నిర్మించాలి అనే విధానాన్ని విరమించుకుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే ఈ వైద్య కళాశాలను నిర్మించాలని విజ్ఞప్తి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ గారు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు,

* వైద్య విద్యను ప్రైవేటీకరించవద్దు.    

* GO 107, 108 రద్దు చేయండి.    

* ఆరోగ్య, వైద్య విద్య రంగంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) విధానాన్ని విరమించుకోండి.

avatar of the starter
# SaveAPMedicalCollegesPetition Starter#SaveAPMedicalColleges

22

Petition updates