Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

పార్లమెంట్ లో బోయల మాటగా ఎంపీ డీకే అరుణమ్మ గళం!

Venkateshwarlu BoyaHyderabad, India
11 Mar 2025

పార్లమెంట్ లోక్ సభ లో కేంద్ర ప్రభుత్వాన్ని, గిరిజన శాఖ మంత్రిని కోరిన ఎంపీ డికె.అరుణ.

- పార్లమెంట్ లో పాలమూరు ఎంపీ డికె.అరుణ తనదైనమార్క్

- పార్లమెంట్ లో తెలుగులో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించిన ఎంపీ డికె అరుణ 

- ఎపి, తెలంగాణలోని బోయ వాల్మీకి వర్గాల చిరకాల డిమాండ్ ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన డికె.అరుణ  

- బోయ వాల్మీకిలు నేటికీ ఆర్థికంగా, విద్యా పరంగా, సామాజికంగా చాలా వెనకబడి ఉన్నారు

- పూర్వం బోయ వాల్మికులు జీవనోపాధి కోసం వేటకు వెళ్ళేవారు

- వారికి ఎలాంటి కులవృత్తి లేక.. ఎవరు పట్టించుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

- బోయ వాల్మీకి లు పక్కనున్న కర్ణాటక తో పాటు అనేక రాష్ట్రాల్లో sc లుగా, ఎస్ట్ లుగా గుర్తింపు పొందుతున్నారు 

- కానీ తెలంగాణ లో ఆంధ్రప్రదేశ్ లోని బోయ వాల్మీకి లు ఇంకా వెనకబడిన తరగతులుగా నే కొనసాగుతున్నారు

- త్వాద్వారా ఈ బోయ వాల్మీకి వర్గం ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది 

- తెలంగాణ మొత్తం కలిసి 5 లక్షల మందికిపైగా బోయ వాల్మీకి సామాజికవర్గ ప్రజలు ఉన్నారు

- తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే బోయ వాల్మీకి లు ఎక్కువగా ఉన్నారు

*చెల్లప్ప కమిటీ సిఫార్సులకు ఆమోదం*

- బోయ వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చాలని వారి చిరకాల కోరిక 

- ఈ ప్రతిపాదనలను గుర్తించి అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం చెళ్ళ్ళప్ప కమిటీ నీ వేసింది 

- ఆ చెళ్లప్ప కమిటీ సిఫారసులను పరిగణలోనికి తీసుకొని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా

- రామాయణం రాసిన వాల్మీకి మహర్షి వారసులుగా ఉన్న వీరందరికీ న్యాయం చేయాలి

- నవభారత నిర్మాణంలో సాధికారత, సమ్మతం సాధించాలంటే ఈ బోయ వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చాలి

- కేంద్ర గిరిజన శాఖ మంత్రి ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలి - అని DK అరుణమ్మ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా నాయకురాలు, MP DK అరుణమ్మ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X