Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
హక్కుల సాధనకై వాల్మీకి బోయల సత్యాగ్రహ దీక్ష

Venkateshwarlu BoyaHyderabad, India

Feb 19, 2017
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకి బోయల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ వాల్మీకి బోయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ మండ్ల వేణుగోపాల్ కోరారు. అడగంది అమ్మైనా.. అన్నం పెట్టదన్నారు. ఎవరో వస్తారో ఏదో చేస్తారని చేతులు ముడుచుకొని ద్రోహుల మాదిరిగా కూర్చోలేమన్నారు.
బోయ జాతి పెద్దలని చెప్పుకుంటున్న సంఘ నాయకులు వాల్మీకి జయంతి రోజు తప్ప బోయల గురించి అసలు పట్టింపే లేదన్నారు. వాల్మీకి నిధులను స్వాహా చేస్తూ బోయజాతిని మోసం చేస్తున్నారన్నారు. హక్కుల సాధనకు బోయలంతా ఫిబ్రవరి 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో టీవీబీఎస్ జేఏసీ చేపట్టిన హక్కుల సాధనకు వాల్మీకి బోయల సత్యాగ్రహ దీక్షకు ఇంటికొక్కరు.. ఊరికో వాహనం కదిలి రావలన్నారు. జాతి పేరు చెప్పుకుని.. పదవుల కోసమో.. నిధుల కోసమో కాసుకు కూర్చునే బోయ సంఘాల నాయకులను తరిమికొట్టండాన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బోయలకు మాటిచ్చి.. మరోసారి బోయజాతిని వంచనకు గురిచేయాలని చూస్తే.. బోయలందరూ తిరగబతారన్నారు. ఇప్పటికైనా వాల్మీకి బోయలకు ఎస్టీ జాబితాలో కలిపేందుకు గత ప్రభుత్వాల లాగ తాత్సారం చేయకుండా.. ఈఏడాది మార్చి రెండో వారంలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలన్నారు. అలా జరగపోతే లక్షమందితో నిరసనలు చేబడతామన్నారు మండ్ల వేణుగోపాల్.
తాత్సారం చేయడం అంటే అణగదొక్కడమే నన్నారు. ఇకనైనా బోయజాతి మేల్కోవాలన్నారు. మన హక్కుల కోసం చేయి చేయి కలిపి ముందుకు రావాలన్నారు. ఇందుకు కుల పెద్దలు, మేధావులు, యువకులు, కళాకారులు, ఉపాధ్యాయులు, సామాజిక వేత్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X