Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

తెలంగాణ గిరిజన,పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి అజ్మీర శ్రీ చందూలాల్ తో డా.చెల్ల‌ప్ప క‌మీష‌న్ భేటి!

Venkateshwarlu BoyaHyderabad, India
Mar 15, 2016
వాల్మీకి బోయ‌లు, ఖ‌యితీ లంబాడాలను ఎస్టీ జాబితాలో క‌ల‌ప‌డానికి వారి జీవ‌న స్థితిగ‌తుల‌పై అధ్య‌య‌నం చేయడానికి డా. చెల్ల‌ప్ప క‌మీష‌న్ ఇవాళ వ‌రంగ‌ల్ జిల్లాలోని క‌లెక్ట‌ర్ ఆఫీసులో బోయ‌ల ఆర్థిక స్థితిగ‌తుల‌పై విచార‌ణ చేప‌ట్టింది. అందులో బాగంగా జిల్లాలోనే ఉన్న గౌర‌వ‌నీయులు తెలంగాణ రాష్ట్ర గిరిజన,పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర శ్రీ చందూలాల్ గారిని కలిసి చెల్లప్ప కమిటీ సభ్యులు కాసేపు ముచ్చ‌టించారు. హ‌రిత కాక‌తీయ హోట‌ల్లో వీరి మ‌ధ్య గంట‌కు పైగా సంభాష‌ణ కొన‌సాగిన‌ట్లు తెలిసింది. మ‌ర్యాదపూర్వ‌కంగా క‌లుసుకున్నట్టు చెబుతున్నా గిరిజ‌నుల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ గురించే చ‌ర్చ కొన‌సాగిన‌ట్టు తెలుస్తోంది. ఇదివ‌రకే కేసీఆర్ అసెంబ్లీలో రెండు నెల‌ల్లో ఎస్టీ , మైనార్టీ రిజ‌ర్వేష‌న్ల‌పై త్వ‌ర‌లోనే తీపిక‌బురు అందిస్తామ‌న్న సీఎం వాగ్ధానం దృష్ట్యా ఇంకా క‌మీష‌న్ గ‌డువు కోరే అవ‌కాశం లేదు గ‌నుక ఇచ్చే రిపోర్టు ఎలా ఉండ‌బోతుంద‌న్న దానిపై ముఖ్యంగా మంత్రిగారు ఆరా తీసిన‌ట్టు తెలుస్తోంది. గ‌త యేడాది నుంచి కొన‌సాగుతున్న ఎస్టీ క‌మీష‌న్ విచార‌ణ తెలంగాణ‌లోని 8 జిల్లాల్లో ముగింపు ద‌శ‌కు చేరుకున్న ధృష్ట్యా మిగిలిన జంట జిల్లాలు హైద్రాబాద్, రంగారెడ్డిలో ఖ‌యితీ లంబాడాలు లేరు. ఇక ఉన్న‌ది ఎక్క‌వ‌గా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా నుంచి వ‌చ్చిన వాల్మీకి బోయ‌లు వ‌ల‌స కూలీలుగా వ‌చ్చి ఇక్క‌డ స్థిర‌ప‌డ్డ వాళ్లు దాదాపు 30 వేల కుంటుంబాలు ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా. సిటీలో విచార‌ణ అనంత‌రం క‌మిటీ స‌భ్యులు నివేదిక సిద్దం చేసి సీఎంకు అప్ప‌గిస్తే త‌మ బాధ్య‌త అయిపోతుంద‌ని స‌భ్యులు భావిస్తున్న‌ట్టు అంచ‌నా. - వెంక‌టేశ్వ‌ర్లు బోయ‌
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X