Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APఎస్టీ సాధనకై వాల్మీకీ బోయల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పాటు! జేఏసీ కన్వీనర్ గా మండ్ల వేణు

Venkateshwarlu BoyaHyderabad, India
Aug 30, 2015
బోయల ఎస్టీ సాధనకై తెలంగాణ వాల్మీకీ బోయల జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని వాల్మీకీ సంఘాల సమక్షంలో ఏర్పడడానికి హైదరాబాద్ లోని బీసీ సాధికారత భవన్ ఆదివారం ఒక వేదికైంది. తెలంగాణ రాష్ట్రంలోని వాల్మీకీ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. తరతరాలుగా బోయలకు జరుగుతున్నఅన్యాయాన్ని ఎదురించడానికి ఒక ఉమ్మడి వేదిక సిద్దమైంది. కేసీఆర్ హామి మేరకు వాల్మీకీ బోయలను ఎస్టీలో తిరిగి చేర్చడానికి రిటైర్ఢ్ ఐఏఎస్ అధికారి చెల్లప్ప చైర్మన్ గా ముగ్గురు సభ్యులతో కూడిన తెలంగాణ షెడ్యుల్ఠ్ తెగల విచారణ కమీషన్ను (జీవో నంబర్ 5 ) మార్చి 3వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటివరకు వివిధ వాల్మీకీ సంఘాలు వారి వారి జిల్లా నియోజక వర్గాల్లో విడివిడిగా వాల్మీకీ సంఘం అభివృద్దికి కృషి చేస్తున్నారు. జిల్లాలో చెల్లప్ప కమిటీకి నివేదికలు ఇస్తున్నారు. కానీ వివిధ సంఘాలకు ఒక ఉమ్మడి వేదిక లేకపోవడంతో వాటి మధ్య సమన్వయం లోపించింది. దానికి వనపర్తి ఎంప్లాయిస్ యూనియన్ ముందుకు వచ్చి సంఘాల మధ్య సమన్వయం సాధించడానికి, బోయల ఎస్టీ సాధనకై తెలంగాణ వాల్మీకీ బోయల జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని వాల్మీకీ సంఘాల సమక్షంలో ఏర్పడడానికి హైదరాబాద్ లోని బీసీ సాధికారత భవన్ వేదికైంది. జేఏసీ కన్వీనర్ గా మండ్ల వేణుగోపాల్, కో కన్వీనర్ గా కొంకల వెంకట రమణను ఏకగ్రీవంగా అన్నీ సంఘాలు ఎన్నుకున్నాయి. అప్పటికప్పుడే జేఏసీకి విరాళాలు వేలలో ఇవ్వడానికి వచ్చినా వారు దానికి సమయం ఉన్నదని ప్రతి పైసా వాల్మీకుల అభివృద్దికి, ప్రతి ఒక్కరికి జవాబుదారీగా ఉండాలనుకున్నట్టు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వాల్మీకీ సంఘాల నాయకులు గట్టు తిమ్మప్ప , కెంగర్ల మల్లన్న, మీనుగ గోపీ, కావలి మణ్యం(టీచర్) తెలంగాణ అమరవీరుల సంఘం, బాలమణెమ్మ, కొత్త కొట, తిరుమలేష్, టి కె కుర్మన్న, పెంటన్న, డిప్యూటీ తాసిల్దార్ రిటైర్, మహబూబ్‌నగర్ , అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా మాధురి, మధుసుధన్, భీమన్న, రాజేషం, టీ గోవిందు, కుమార్ స్వామి నాయుడు గుజ్జుల యాదయ్య, సాయులు, గోవింద రాజులు ఇంకా తెలంగాణ పది జిల్లాలలోని వాల్మీకీ సభ్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయి కమిటీని రూపొందించి కార్యచరణను మొదలు పెడతామని కన్వీనర్ మండ్ల వేణుగోపాల్ తెలిపారు. దీంతో వాల్మకీల్లో ఎనలేని ఉత్సాహం రెట్టింపు అయింది.
-Venkateswarlu Boya
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X