Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APA representation to Dr.Chellappa (Commission for the inquiry of Scheduled Tribes Govt of Telangana)

Venkateshwarlu BoyaHyderabad, India
Aug 19, 2015
Sir, I am Venkateshwarlu Boya belongs to valmiki/boya community from Hyderabad whom studied PG Journalism in Osmania University in 2008 till unemployee, and this is my present status. My socio, economic life story as fallows...below
నా పయనం ఎటు? (My life story from www.telanganajournalism.com)
ఆ రోజుల్లో(1987-91)నా చదువు 4,5వ తరగతిల్లోనే అగిపో పరిస్థితి, అలాంటిది జర్నలిజం లో పీజీ పట్టా చేస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. అందుకు సహకరించిన మా వూరి పెద్దలకు,బందువులకు, నా మిత్రులకు, నా స్కూలు,కాలేజీ, యూనివర్సిటీ గురువులందరికి పేరు పేరున రుణపడి ఉంటాను.
ముందుగా నా మొదటి గురువు మా అమ్మకు,నా రెండవ గురువు శ్రీ పద్మనాభ రావ్ గారికి, మూడవ గురువు కీర్తిశేషులు శ్యాం రావ్ (నా పై చదువులకు స్పాన్సర్ చేసిన దేవుడు, పచ్చర్ల గ్రామ కర్నం అయ్య), నా నాల్గవ గురువు శ్రీ నారాయణ రెడ్డి గారికి (గద్వాల గంజిపేట అప్పర్ ప్రైమరి ల్లో 5వ తరగతి తరువాత మహబుబ్ నగర్ ప్రభుత్వ ఆర్ఫన్ హాస్టల్లో సీటు రావడానికి సహాయపడిన గురువు,ఆ సీటు వచ్చే వరకు అంటే దాదాపు 3నెలలు వాళ్ల ఇంటిలోనే ఉన్నాను) మా అమ్మ ఒక్కతే (మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు)కూలీ పని, ఇంటి పనులు చేసి నా పిల్లలు బాగుపడాలి నాలా కష్టపడొద్దని ఊల్లోని ఒకే ఒక మంచి స్కూల్ అది 2 వరకే అందులో చేర్పించింది. పాఠాలు చెప్పే మా ఊరు పచ్చర్ల బాపనయ్య తొడపాశానికి భయపడి 2వ తరగతి వరకు చదివి, 3,4 వ తరగతికి మల్లి పక్క ఊరైన తనగలకు పోవాల్సిందే. అక్కడ 3,4 ఆ తరువాత 5 గద్వాల, 6,7 మహబుబ్ నగర్ జిల్లా కేంద్రం అటునుంచి మల్లి 8వ తరగతి నుంచి సరూర్ నగర్ వీ ఎం హోం కి (ఈ స్కూల్ ని యుద్ధం లో చనిపోయిన సైనికుల పిల్లల కోసం మొదలై ఆ తరువాత అనాధల కోసం మన మొదటి ప్రధాని చాచా నెహ్రూ పకడ్బంధీగా ఎవరు మోసం చేయకుండా స్వయం ప్రతిపత్తిని కల్పించారు. ఎథిం ఖానా అని పిలువబడే ఈ అతి పురాతన భవనాన్ని 1903 లో ఆఖరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సాబ్ కట్టించి తొండ ఎదురు వచ్చిందని విక్టొరియా రాణికి బహుమతిగా ఇవ్వగా తదనంతరము తల్లిదండ్రులను లేదా ఎవరో ఒకరిని, పేద వాళ్ల,అనాధల పిల్లలకు చదువుల తల్లిగా ఎందరికో బ్రతుకు దెరువును చూపించిందీభవనము) వచ్చి చేరాను.
ఎస్ ఎస్ సీ మార్చ్ చివరి పరీక్షలు 1997 లో అయిపోయాయి. వి ఎం హోం లో పది వరకే ఉంది ఆ తరువాత పై చదువులకు మల్లి క్వషన్ మార్క్? రిజల్ట్స్ వచాయి నూటికి 96 శాతం పసయ్యారు. పసయిన విద్యార్తులందరు కలసి అప్పటి సాంఘీక సంక్షేమ శాఖ కమీష్నర్ ఐ ఏ ఎస్ గార్ఘ్ గారిని కలసి మా ఫ్యూచరేందని అడగగా ఆయన స్పెషల్ జీవో ద్వారా మమ్మల్లందరిని ఎవరి జిల్లాలో వారికి ఏపీ ఎస్ డబ్ల్ల్యు ఆర్ జూనియర్ కాలేజీల్లో చవుకోవడానికి అవకాశం కల్పించారు. ఆయనకు మేమెంతో రుణపడి ఉంటాము. ఆ తరువాత అక్కడి విద్యార్థులకు ఆ జీవో ఆనవాయితీ గా నడుస్తోంది.
ఇంటర్ లో నేను ఒక యేడాది మహబుబ్ నగర్ లో రెండవ సంవత్సరం మల్లి హైదరాబాద్ కు రావడము జరిగింది. పని చేస్తేనే తినడానికి, ఉండడానికి కొరాయి ఎల్లేది. ఎవరు లేరు అమ్మ ఒక్కతే దానికి తోడు మా తమ్ముడు భాస్కర్(ఇటిక్యాల కు చెందిన రేణుక అనే అమ్మయితో వివాహము 2013 లో జరిగింది. ఇప్పుడు ఒక కొడుకు), చెళ్లెలు సుజాత( చెళ్లెలుకు నా 9వ తరగతిలోనె పెల్లి చేసి గద్వాలకు పంపడము, వాళ్లు తిరిగి మా దగ్గరకే రావడము జరిగింది. ఇప్పుడు ఆమెకు ఒక బిడ్డ సునిత, ఒక కొడుకు సురెష్)ఆ సంవత్సరం ఫైనల్ పరీక్షల్లో(1999) ల్లో ఫెయిల్ అవ్వడం మల్లి సెప్టంబర్ లో రాసి పాసయ్యాను.
దిల్సుఖ్ నగర్ లో కిరాయికుండే మేము ఎస్ ఎస్ సీ చదువేటప్పుడు నా జూనియర్ సుదర్శన్ అనే మహబుబ్ నగర్ అయ్యవారిపల్లెకు చెందిన దలిత విద్యార్థి తో పరిచయము వల్ల ండకు(2000-01 లో) రావడము జరిగింది. అక్కడే బతుకు దెరువంటే ఎందో తెలిసి వచ్చింది.
బోరబండలో పెయింటుంగు పని చేస్తూ మా కుటుంబాము మొత్తము ఇక్కడకు షిఫ్ట్ అయ్యాము. అందరము అదే కూలి పని కిరాయి, తిండి ఖర్జులకు మాత్రమే సరిపోయేది. కూడబెట్టు కోవడము, భూములు, ప్లాట్స్ కొనే స్తోమత మాకు ఉండేది కాదు. ఒకే ఇంటిలోనే 16 యేండ్లు ఉన్నా కబ్జా అనే మాట ఎరుగము. అప్పులతో(తమిళ నాడుకు చెందిన ఫైనాన్స్ వాళ్లు ఇచ్చే వారు)కాళం వెల్లబుచుతూ బతికాము మా ఫ్యామిలీ మొత్తము. మా అమ్మ అంగనవాడీ లో హెల్పరు గా, నేను స్కూల్లో టీచర్ గా చేస్తూ నా డిగ్రీ అంబెద్కర్ ఓపెన్ యునివర్సిటీ లో 44.88 శాతములో పాసయ్యాను. ఆ డిగ్రీ నాకు కనీసము బీఈడీ చదవడానికి కూడా రాకుండా పాసు చేశారు (2005 లో) అక్కడి సిబ్బంది.
అప్పటి నుంచి నా నిరుద్యోగము నా వెంబడే ఉంటూ కంటికి నిద్ర లేక, ఒక పెద్దయాన సలహా తో ఉస్మానియా యునివర్సిటీ జర్నలిజము కోర్సులో చేరాను(2007-08). ఆ కోర్సు చదివాక 6,7 సంవత్సరములు ఐ న్యూస్ లో ప్రోగ్రాం ప్రొడ్యూసరు గా జాబ్ చేస్తూ కొల్లాపురు కు చెందిన శ్రీవాణీని పెళ్లి (2010 లో) చేసుకొని ఇద్దరు పిల్లలకు (మేఘన, అనన్య)తండ్రి నయ్యాను. తెలంగాణా విభజన పుణ్యమా లేక నా స్వయంకృపారాధమో తెలియదు గాని మల్లి నా నిరుద్యోగము తో నా జీవితము మూడు రూపాయల సంపాదనా ఆరు రూపాయల అప్పులతో కాలము వెల్లబుచ్చుతున్నాని. ఆ దేవుడు ఇంకా ఎన్ని కష్టాల్ని కలిగిస్తాడో వేచి చూడాల్సిందే..
నా బలము 1.) నమ్మకంగా పని చేయడము 2.) అక్రమ సంపాదన అలవాటు లేదు 3.) నచ్చితే సొంతపనిలా చూసుకోవడం 4.) నీతి, న్యాయం ధర్మం అనే సూత్రాలు తూచా తప్పక పాటించడం 5.) ముక్కు సూటిగా మట్లాడటము
బలహీనతలు 1.) ఇంగ్లీస్లో ఫ్లుయెన్సీ లేదు 2.) టైపింగ్ లో స్పీడ్ లేదు 3.) తప్పు నాది కానప్పుడు సహించకపోవడము
ఉద్యోగము కోసము ఎదురు చూస్తూ…
మీ తెలంగాణ నిరుద్యోగి..
వేంకటేశ్వర్లు బోయ(M.C.J ),
boya.venkateswarlu@gmail.com,
9391204009
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X