SAVE MEESEVA IN ANDHRAPRADESH ( సేవ్ మీసేవ ఇన్ ఆంధ్రప్రదేశ్ )

0 have signed. Let’s get to 5,000!


గౌరవనీయులు అయిన సర్/ మేడం గారికి,

గ్రామ/వార్డ్ సచివాలయాల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తరువాత మీసేవల మనుగడ ప్రశ్నర్థకంగా మారింది.

సచివాలయాలు వచ్చిన తరువాత ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ మీసేవలను రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు అన్న వార్తలు మా మనుగడను ప్రశ్నర్థకంగా చేసాయి.

మాకు అందిన సమాచారం ప్రకారం సచివాలయంలో మీసేవ సర్వీసెస్ ను జనవరి నుండి రన్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు.

అందుకే రాష్ట్ర మీసేవ అసోసియేషన్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని మీసేవ సెంటర్స్ ఈ నెల20 నుండి బంద్ లో ఉన్నాయి.

ఈ రోజు అనగా 26-12-2019 , ESD డిపార్ట్మెంట్ తో చర్చలు విఫలమయ్యాయి. గత 13 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్న మా బాధ ప్రభుత్వానికి పట్టలేదు.

ఈ విషయం లో సహకరించి మా బాధను గవర్నమెంట్ కు చేరేలా చెయ్యాలని వేడుకుంటున్నాము.


ధన్యవాదాలు
మీసేవ నిర్వాహకుల సంక్షేమ సంఘం,
ఆంధ్రప్రదేశ్.
రి.నెం.74/2012.