ముఖ్యమంత్రి కెసిఆర్ గారి హామీ ప్రకారం సింగరేణి లో కారుణ్య నియామకాలు తొందరగా ఇవ్వాలి.

The Issue
"సింగరేణి కార్మికులు సరిహద్దుల్లోని సైనికులతో సమానం" : కెసిఆర్
అటువంటి కార్మికుల బ్రతుకులు ఇప్పుడు చీకట్లు అలుముకున్నాయి. ఎన్నికలలో గెలిపిస్తే/గెలిస్తే అప్లై చేసిన వారందరికీ వెంటనే మెడికల్ బోర్డు తెరిచి ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఇంకా అమలు కాలేదు. దీపావళి అందరి బ్రతుకులలో వెలుగులు తెస్తే, దీపావళి కానుక అని ఆశపడిన చీకటి సూర్యుల బ్రతుకు దీపావళి కానుక రాక చీకటి కలుముకుంది.
తెరాస పుట్టినప్పటి నుండి సింగరేణి కార్మికులు మద్దతు గా నిలిచారు మొన్నటి యూనియన్ ఎలక్షన్స్ వరకు... తెలంగాణ కోసం దీక్ష లో కూసున్నపుడు ఈ సింగరేణి కార్మికులే చరిత్ర లో ఏన్నడు లేని విధంగా సమ్మే లో పాల్గోని పెద్దన్న పాత్ర పోషించారు...
తెలంగాణ కోసం పోరాడిన కార్మికులు ఎప్పుడు మీతోనే ఉంటూ , ఎన్నికలకి ముందు పార్టీ మీద నమ్మకం లేకున్నా కేవలము మీ మాటలు నమ్మి చరిత్ర సృష్టించేలా గెలిపించాము. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదు. కేసులు వేస్తారని భయపెడుతూ, "త్వరలో" మరియు "న్యాయ సలహాలు " అని మాటలు చెప్పుతూ దాటవేస్తున్నారు. మీరు గెలిచినప్పటినుండి ఇప్పటివరకు సుమారుగా వేయి మంది కార్మికులు దిగిపోయారు. చివరి వరకు వారి కండ్లల్లో ఎదో జరుగుతుందన్న ఆశ పెట్టుకొని అది నెరవేరక కండ్లలో నీళ్లు నింపుకొని దిగిపోయారు.
దసరా కి గెలిపిస్తే దీపావళి ఉద్యోగాలు అన్నారు... నమ్మారు గెలిపించారు... వేయి మంది పైగా దిగిపోయారు.. అందులో ఉద్యోగాలు వస్తాయని బిడ్డలకు లగ్గం చేసి అల్లుడికి నౌకర్లు పెట్టించిన వాళ్ళు ఉన్నారు.. చేస్తున్న నౌకరి మానేసి ఈ ఉద్యోగం కోసం ఎదురుచూసే కొడుకు ఉన్నాడు... అస్తి పంపకాలు, గోడవలు.. అంత ఆగం చేసారు... ఇంకా ఏం సప్పుడు చేస్తలేరు... గెలిచిన సంఘం ఉన్నదా లేదా అన్నట్టు ఉంది.. ఓడిపొయిన సంఘం మమ్మల్ని గెలిపించలేదు గా అనుభవించుండ్రి అన్నట్టు ఉంది.. అటూ కొడుకు, బిడ్డ గోస చూడలేక.. ఇటూ పని కి చాతన కాక మధ్యలో కార్మికుడు నలిగిపోతున్నాడు....
ఇప్పటికైనా ఈ నెల చివరి వరకు కొత్త వ్యాధులు చేర్చి పోయిన ఏడాది అప్లై చేసిన కార్మికులందరికీ న్యాయం చేయగలరు. కార్మికలోకం మీపై ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంది. కార్మికులు కూడా అనారోగ్యం బారిన పడి విధులు నిర్వర్తించలేక మీ నిర్ణయం కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ గారి హామీ ప్రకారం సింగరేణి లో త్వరగా కారుణ్య నియమకాలు అమలు చేసి ఉద్యోగాలు కల్పించి కార్మికుల ఋణం తీర్చుకోవాలి..
దయచేసి సింగరేణి కి సంబందించిన వారు అందరూ దీనిని షేర్ చేసి ఇందులో మీ మద్దతు తెలుపగలరు.

Petition Closed
Share this petition
Petition Updates
Share this petition
Petition created on 7 December 2017