Petition updateExtension of Hyd Metro Rail Phase2 to Medchal,Shamirpet,Gandimaisamma and Northern HydDharna for Medchal Metro Rail in Phase 2 is a big success. Thank you all 🙏🙏
Venkateswarlu Yadav OrugantiHyderabad, TS, India
Oct 7, 2024

06.10.2024
మేడ్చల్ - మల్కాజ్గిరి.

సుచిత్రలో హైదరాబాద్ మెట్రో రైల్ ని మేడ్చల్ & శామిర్పేట్ వరకు పొడగించాలి చేస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు అత్యధిక అభివృద్ధి చెందుతున్న జాతీయ రహదారిలో ఉన్న సుచిత్ర,కొంపల్లి, మేడ్చల్ మరియు శామిర్పేట ప్రాంతాల వరకు జూబ్లి బస్ స్టేషను నుండి మెట్రో రైల్ మార్గాన్ని పొడగించాలి. 

ఈ విషయం లో కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉండేలా బాధ్యత తీసుకుంటానని, ఇక్కడి ప్రజల అవసరాల దృష్ట్యా అత్యధికంగా ఐటీ ఉద్యోగులు ఉన్న ప్రాంతంగా ఉండటంతో రాకపోకలు ఇబ్బందిగా మారుతున్న దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి మెట్రో మార్గాన్ని పొడగించే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి.

ఈ కార్య్రమంలో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సంపత్ రెడ్డి గారు, ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ గారు, బీజేపి జిల్లా ఇన్చార్జి అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్దన్ రెడ్డి, మాణిక్య రెడ్డి ,కార్యదర్శి భరత్ సింహ రెడ్డి, రాజిరెడ్డి, సతీష్ రంగంపేట, పత్తి సతీష్, పులి బలరాం, నల్ల జయశంకర్ గౌడ్, శేఖర్ యాదవ్, శ్యామ్ కిరణ్ రెడ్డి మరియు స్థానిక ప్రజలు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X