రోల్ బ్యాక్ 22A (ROLLBACK 22A )
The Issue
పిటిషన్ టైటిల్: 22A రద్దు చేయాలి: ఆంధ్రప్రదేశ్‌లో పదుల లక్షల ఎకరాల ప్రైవేట్ భూములకు విముక్తి కల్పించండి!
పిటిషన్ ఎవరికి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి
సమస్య తీవ్రత: మీ జీవితకాల కష్టార్జితంతో కొనుక్కున్న ఆస్తిని, రాత్రికి రాత్రే ప్రభుత్వం ఒక్క క్లిక్ తో లాగేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పదుల లక్షల ఎకరాలు సెక్షన్ 22A నిషేధిత జాబితాలో బందీ అయ్యాయి.
ఇదెలా జరిగింది? ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. 2015 తరువాత "వెబ్‌ల్యాండ్ (Webland)" పేరుతో రికార్డుల కంప్యూటరీకరణ జరిగింది. ఆ సమయంలో ప్రజల దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు, పాత పాస్‌బుక్ లు చూడకుండా.. ఏ 100 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం (RSR) రికార్డులని ఆధారంగా తీసుకున్నారు.
ఒకప్పుడు ఆ రికార్డులలో కంకరగుట్ట అనో, వాగు అనో ఉంటే... దాన్ని "ప్రభుత్వ భూమి" గా మార్చేసి, ఎవరికీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చీకట్లో 22Aలో పడేసారు రెవెన్యూ అధికారులు. ఈ జాబితా వల్ల ప్రజలు తమ సొంత ఆస్తిని అమ్ముకోలేక, పిల్లకు పెళ్లిళ్లు చేయలేక, వైద్యానికి డబ్బుల్లేక నరకయాతన పడుతున్నారు.
లంచాల సామ్రాజ్యం: తమ భూమి ప్రభుత్వానిది కాదని నిరూపించుకునే భారాన్ని అధికారులేమో సామాన్యుల మీద వేశారు. ఇదే అదనుగా అవినీతి అధికారులు కేవలం 5 సెంట్ల ఇంటి స్థలం క్లియర్ చేయడానికి 2 లక్షల రూపాయల లంచం అడిగే స్థాయికి తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అవినీతి వేల కోట్లలో ఉంది. ఒక్క దామినేడు గ్రామంలోనే 300 కోట్ల రూపాయల భూకుంభకోణం జరిగిందని సాక్షాత్తూ లోకాయుక్త రికార్డుల్లోనే ఉంది.
కోర్టులంటే కూడా లెక్కలేనితనం: ఈ రెవెన్యూ అధికారులకు కోర్టులన్నా భయం లేదు. దామినేడు గ్రామంలో 83 ఏళ్ల డా. కస్తూరి గారికి చెందిన 4.85 ఎకరాల భూమిని ఒక తహసీల్దార్ ఉప్పరపాలెం చెరువు కింద 22A లో పెట్టారు. అక్కడ అసలు చెరువే లేదని, భూమిని వెంటనే విడుదల చేయాలని 2022లో హైకోర్టు తీర్పు ఇచ్చినా అధికారులు చెత్తబుట్టలో వేశారు. గత్యంతరం లేక ఆ పెద్దాయన కోర్టు ధిక్కరణ (Contempt Case 831 of 2023) కేసు వేశారు. చివరికి ఫిబ్రవరి 2026 లో కలెక్టర్, తహసీల్దార్, మరియు సబ్-రిజిస్ట్రార్ లను సివిల్ జైలుకి (Form-I) పంపుతామని హైకోర్టు తీవ్రంగా హెచ్చరిస్తే కానీ, ఆ భూమికి విముక్తి లభించలేదు.
మన డిమాండ్: తక్షణమే 22A రోల్‌బ్యాక్ (ROLLBACK) చేయాలి! ఏ చేత్తో అయితే అయితే ఈ దుర్మార్గం చేశారో, అదే చేత్తో ఒక్క రాత్రిలో వీటిని పరిష్కరించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే "డిజిటల్ డేటా పర్జ్ (Digital Data Purge)" చేపట్టాలి.
మా డిమాండ్లు ఇవే:
- 2014 తర్వాత 22A లో పెట్టిన ప్రైవేట్ భూములను మొత్తం 2015 కు ముందున్న పాత స్థితికి (Pre-2015 status) పునరుద్ధరించాలి.
- 2015 కి ముందు సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉన్న మ్యాన్యువల్ 22A రిజిస్టర్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. నిరూపణ భారాన్ని ప్రభుత్వం తీసుకోవాలి.
- ఏదైనా భూమి ప్రభుత్వానిది అని అనుకుంటే, వారే ముందు నోటీసు ఇచ్చి కోర్టులో నిరూపించుకోవాలి.
ఈ అరాచకానికి ముగింపు పలకడానికి, 22A రోల్‌బ్యాక్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పిటిషన్ పై సంతకం చేయండి! ఏకమవుదాం... మన ఆస్తి హక్కులను సాధించుకుందాం!

639

Supporter Voices
Petition Updates
Share this petition
Petition created on 30 June 2026