Actualización de la peticiónSave Nallamala Forest from Uranium MiningSave Nallamala Petition crossed 1Lakh signature - DYFI
Dyfi TelanganaHyderabad, India
14.09.2019

నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వస్తున్నది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ, గిరిజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా సీనినటులు సైతం నల్లమలను కాపా డాలంటూ సోషల్‌ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని వెల్లడి స్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. చేంజ్‌.ఆర్గ్‌ ద్వారా రాష్ట్రపతికి పెట్టిన ఈపిటిషన్‌లో సంతకాలు చేసిన వారు లక్షకుపైగా చేరారని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం విప్లవ్‌కుమార్‌, కార్యదర్శి ఎ విజరుకుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నల్లమల అడవుల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యధిక ప్రాణ వాయువు ఆక్సిజన్‌ అందుతున్నదని పేర్కొన్నారు. యురేనియం తవ్వడం వల్ల పర్యావరణం కలుషితమవుతుందని తెలిపారు. దేశంలోనే అరుదైన టైగర్‌ ఫారెస్టు ధ్వంసమై పులులు, చిరుతలు, అనేక జీవజాతులు, వృక్షజాతులు, ఔషధ మొక్కలు అంతమైపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. నల్లమల పరిధిలో అరుదైన ఆదిమజాతి అయిన చెంచులను అడవి నుంచి వెళ్లగొట్టడం వల్ల వారు అంతరించిపోతారని తెలిపారు. యురేనియం, మైనింగ్‌ చేయడం వల్ల వచ్చే అణుధూళి, అణువ్యర్థాలు పక్కనే ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతం, పంటలు, మనుషులు, జీవకోటి క్యాన్సర్‌లాంటి అనేక రోగాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో భవిష్యత్‌ తరాలకు కాలుష్యాన్ని, విషతుల్యాన్ని అందించే దుర్మార్గపు కుట్రను సహించబోమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం తవ్వకాల కుట్రను ఇరు రాష్ట్రాల్లోని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వ్యతిరేకించాలని పేర్కొన్నారు. ఈపిటిషన్‌లో సంతకాలు చేసిన సామాన్యుల నుంచి సినీనటులు సమంత వరకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు..
http://www.navatelangana.com/article/state/868954

Copiar enlace
WhatsApp
Facebook
Email
X