Обновление к петицииNo Religion No Caste .. One More Option Please..

Mr. Rajveer is Figthing for No Religion No Caste Option !

RAMAKRISHNA RAO D​.​V.Hyderabad, TG, Индия
31 июл. 2020 г.

#NoReligionNoCaste -

తన కుమార్తె కు కుల, మత రహిత టి.సి ని పొందిన అహమ్మదాబాద్ కు చెందిన ఒక ఆటో డ్రైవర్ కథ !

2017 లో తన పేరును " ఆర్ వి 155677820" గా మార్చుకుందామని ప్రయత్నించి విఫలమైన ఆటో డ్రైవర్.. టెస్లా కంపెనీ సి.ఈ.ఓ ఎలాన్ మస్క్, గాయిని గ్రైమె దంపతులు ఇటీవల తమకు పుట్టిన బాబు కు ప్రత్యేకంగా పెట్టుకున్న పేరు " ఎక్స్ ఎ ఇ ఎక్స్ ఐ ఐ " లా తనకు కుదరకున్నా 6 జూలై,2020 న తన పాప స్కూల్ టి సి తీసుకునే సందర్భం లో కుల , మత రహిత సర్టిఫికేట్ తీసుకున్నారు..

ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ రాజ్ వీర్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ తన కుమార్తె ఆకాంక్ష స్కూల్ టి సి ని ఎటువంటి కుల, మత ప్రస్తావనలు లేకుండా తీసుకున్నట్లు తెలియజేసారు.. గత కొన్ని మాసాలుగా పడిన శ్రమకు ఫలితంగానే ఇది సాధ్యమయిందని రాజ్ వీర్ తెలియజేశారు..
" కుల రహిత సమాజాన్ని కొరుకునే వాళ్ళం , ఇలాంటి ఒక ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంద " ని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు..
ఈ సర్టిఫికేట్ పొందడానికి అనేక సార్లు అహమ్మదాబాద్ జిలా కలెక్టర్ కు, రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని గరికి వినతి పత్రాలు ఇచ్చి విస్తృతంగా చేసిన ప్రయత్నాలను తెలియజేశారు..

ఈ సందర్భంగా తమిళనాడు లోని తిరుపత్తూరుకు చెందిన ఎం ఎ స్నేహ కుల రహిత, మత రహిత అస్తిత్వం తో సర్టిఫికేట్ సాధించిన విషయాన్ని పలుమార్లు , వివిధ స్థాయి అధికారులతో ప్రస్తావించినట్లు, అలానే తమ విషయం లోనూ సహకరించమని కొరినట్లు తెలియజేశారు..

గతంలో అంటే, 2017 మే లో తన పేరును " ఆర్ వి 155677820" గా మార్చుకుందామని , జిల్లా కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నారు.. తన పేరు రాజ్ వీర్ లోని మొదటి రెండు అక్షరాలతో పాటు , తన స్కూల్ టి సి లోని సీరియల్ నంబర్ కలిపి పెట్టుకున్నారు.. అయితే అదే సమయంలో గుజారాత్ మూడు ఉద్యమాలతో అట్టుడికిపోతోంది.. పాటీదార్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలని , ఒ బి సి లు రిజర్వేషన్ లను ఎట్టి పరిస్థితులలో నీరుగార్చ నివ్వమని, దళితులు భూమి పై హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు..

రాజ్ కోట్ లోని ప్రభుత్వ ప్రింటింగ్, స్టేషనరీ శాఖకు చెందిన గెజెట్ అధికారిని కలవమని, అక్కడ పేరు మార్పు చేసుకొమని అధికారులు ఇచ్చిన సలహా మేరకు అక్కడకు పోయి విన్నవించుకున్నా అధికారులు తిరస్కరించారు.

ఈ క్రమంలో రాజ్ వీర్ గెజెట్ అధికారి ఉత్తర్వు ను ప్రశ్నిస్తూ , ఎప్రిల్ 2019లో హైకోర్టులో తనను నాస్తికుడిగా గుర్తించమని పిటిషన్ దాఖలు చేశారు.. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు... కార్ల్ మార్క్స్, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ ల బోధనలు తనకు తాత్విక ప్రేరణ అని ఒక ఇంటర్వ్యూ లో రాజ్ వీర్ చెప్పారు.. ఇది రాజ్ వీర్ గారి పోరాటం..

ఈ సందర్భం లో పెద్దమ్మాయి స్పందన స్కూల్ టి సి , ఇంటర్మీడియట్ అయ్యాక తీసుకున్న టి సి లు మత రహిత, కుల రహిత అస్తిత్వం తోనే తీసుకున్నాం.. అవి కూడా ఈ పోస్ట్ తో పాటు పంచుకుంటున్నాను..
అయితే, మొత్తంగా ఆఫ్ లైన్ అయినా, ఆన్ లైన్ అయినా మత రహిత , కుల రహిత అస్తుత్వం ప్రకటించుకునే వారికి ఆ హక్కు ఉండాలి కదా..

తాము కొరుకున్న మతం నమ్మడానికి, ప్రకటించుకోడానికి స్వేచ్చ ఉన్న అందరూ , మరి మాలాగా ఎదీ నమ్మని, ఆచరించని వారి హక్కుకు , మత, కుల రహిత అస్తిత్వ గుర్తింపుకు సహకరిస్తారని, ఒక ప్రజాస్వామిక ఆకాంక్షను బలపరుస్తారని ఆశిస్తున్నాము.. మిత్రులు డేవిడ్ , రూప దంపతులు వాళ్ళ బాబు బర్త్ సర్టిఫికేట్ మత రహిత, కుల రహిత అస్తిత్వంతో కోరుతూ సంవత్సర కాలంగా పోరాడుతుంటే, గత పదేళ్లుగా మేము మా పిల్లల మత రహిత, కుల రహిత అస్తిత్వం కోసం స్కూల్, కాలేజ్ స్థాయిలో పోరాడుతున్నాం.. మా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో తీర్పుకోసం ఎదురు చూస్తున్నాయి..

ఈ కథను విధానకర్తలలో కదలిక తీసుక రావడానికి షేర్ చేయండి.. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలతో..

ఈ కథను నాతో పంచుకుని , తెలుగు చేసి అందరికి చేరేలా చూడమని కోరిన Jhansi Rao గారికి కృతజ్ఞతలు

ఈ కథనానికి సంబంధించిన లింక్  -

https://timesofindia.indiatimes.com/…/videoshow/76830521.cms

 

Скопировать ссылку
WhatsApp
Facebook
Nextdoor
Эл. почта
X