Atualização do abaixo-assinadoNo Religion No Caste .. One More Option Please..మీ నమ్మకాలను మేము గౌరవిస్తున్నాం.. మరి మా నమ్మకాలను మీరూ గౌరవించండి..!
RAMAKRISHNA RAO D​.​V.Hyderabad, TG, Índia
5 de out. de 2020

#NoReligionNoCaste -
ఎనిమిది వేల సంతకాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా..
మీ నమ్మకాలను మేము గౌరవిస్తున్నాం.. మరి మా నమ్మకాలను మీరూ గౌరవించండి..
మా పిల్లల విషయంలో మేము అడుగుతున్న కుల రహిత, మత రహిత అస్తిత్వ పోరాటానికి 10 ఏళ్లు ఎప్పుడో దాటిపోయాయి.. ఆ క్రమంలో 2017 మార్చ్ లో మాలాంటివారి హక్కును గుర్తించమని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసాం.. ఇంకా మా వ్యాజ్యం పై తీర్పు వెలువడలేదు.. ప్రభుత్వాలు, కోర్టులు పైన అనేక సందర్భాలలో ప్రజలే తమ పోరాటాలతో ఒత్తిడి తీసుకురావడం వల్లే మనం ఈ కొద్దిపాటి హక్కులను సాధించుకోగలిగాం.. ఇంకా చాలా దూరం మనం ప్రయాణం కొనసాగాల్సి ఉంది..
ఈ క్రమంలో తమిళనాడు కు చెందిన ఎం ఎ స్నేహ ( Sneha Parthibaraja
) 2019లో కుల రహిత , మత రహిత సర్టిఫికేట్ సాధించడం మా పోరాటానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది.. ఈ ఏడాది మే లో తమ బాబు ఇవాన్ రూడే ( Ivan Rudey
) కు కుల రహిత, మత రహిత అస్తిత్వంతో బర్త్ సర్టిఫికేట్ కావాలని కోరుతూ డేవిడ్ , రూపా
దంపతులు కూడా తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు.. ఈ వెలుగులో కోర్టు సానుకూలంగా స్పందిస్తుని ఆశిస్తూ ఎదురుచూస్తున్నాం..
మా పోరాటానికి మద్దతు సేకరించడంలో భాగంగా మేము 16 మార్చ్ ,2017 న " నో రెలిజియన్ నో కేస్ట్ " అస్తిత్వ ప్రకటనకు అన్ని అప్లికేషన్ లలోనూ, మొత్తంగా పుట్టుక నుంచి మరణం దాకా అలాంటి అవసరం ఉన్నవారికి అటువంటి ఆప్షన్ ఒకటి ఇవ్వమని అడుగుతూ ఆన్ లైన్ లో చేంజ్ డాట్ ఆర్గ్ పిటిషన్ ద్వారా సంతకాల సేకరణకు పూనుకున్నాం.. అయితే పిటిషన్ మొదలు పెట్టిన మూడు సంవత్సరాల ఆరు నెలల పంతొమ్మిది రోజులకు అంటే 04 అక్టోబర్,2020 నాటికి ఎనిమిది వేల ( 8000) సంతకాలు పూర్తయ్యాయి..
వాస్తవానికి 2011 జనాభా లెక్కల ప్రకారం మతం చెప్పని వారి సంఖ్య 28.7 లక్షలుగా ఉంది.. వారిలో ఒక్క శాతం మంది మా పిటిషన్ పై సంతకం చేసినా ఈపాటికి 28 వేల సంతకాలు అయి ఉండేవి.. బహుశా మా పిటిషన్ అవసరం ఉన్న ఆ ఒక్క శాతం మంది వద్దకూ చేరలేదు కావొచ్చు.
అయినా ఇది కేవలం ఏ మతం నమ్మని వారి సమస్య ఎంత మాత్రం కాదు.. వాస్తవానికి మత స్వేచ్చ ఉన్న ప్రతి ఒక్కరూ , తమ మత ప్రకటనకు అవకాశం ఉన్న వారంతా మాలాంటి వారి హక్కును బలపరచవలసిన అంశం.. మీ నమ్మక ప్రకటన హక్కు మీకు ఉన్నపుడు , మా నమ్మక ప్రకటన హక్కు మాకూ ఉండాలి కదా.. అందుచేత ఒక ప్రజాస్వామిక స్పూర్తితో మా పొరాటాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలి..
ఎనిమిది వేల సంతకాలయిన ఈ సందర్భంలో మా పిటిషన్ ను 51,974 మంది చూసినట్లు గా చేంజ్ డాట్ ఆర్గ్ చెబుతోంది.. చూసిన అందరూ సంతకాలు చేయడం లేదు.. చూసిన వారిలో 15 శాతం మంది మాత్రమే సంతకాలు చేసారు.. మిగతా 85 శాతం మంది ఎందువల్ల సంతకం చేయలేదో మేము తెలుసుకోవాలి .. వారినీ చేరుకోవాలి..
మా పిటిషన్ పై సంతకాలు చేసిన ఎనిమిది వేల ( 8000) మందికీ పేరు పేరునా హార్దిక కృతజ్ఞతలు.. మా పిటిషన్ ను షేర్ చేసిన ఏడు వేల అరవై ఆరు (7066) మందికి పేరు పేరునా చాలా చాలా ధన్యవాదాలు.. మా తరఫున పోరాడుతున్న న్యాయవాదులు - డి.సురేష్ కుమార్ , వెంకన్న గార్లకు కృతజ్ఞతలు.. మా పిటిషన్ లో ఇంప్లీడ్ అయిన డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ( డి టి ఎఫ్ ) కు కృతజ్ఞతలు.. మా వెంట నిలిచిన వివిధ ప్రజా సంఘాలు , సామాజిక కార్యకర్తలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు..
మా పిటిషన్ చదివి సంతకం చేయండి.. అందరికీ చేరేలా షేర్ చేసి.. మాకు సహకరించండి.. పిటిషన్ లింక్ ఇదిగో.. https://www.change.org/p/no-religion-no-caste-one-more-option-who-ever-wants-to-opt 

 

- డి.వి.రామకృష్ణారావు - ఎస్. క్లారెన్స్ కృపాళిని
హైదరాబాద్, 05.10.2020

Copiar link
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X