

గ్యాంగ్ రేప్ చేశారు.
మళ్ళీ ఏమైనా చెబుతుందేమో అని పట్టుకుని నాలుక కోసేశారు.
ఛిద్ర దేహంతో
నెత్తుటి నోరుతో
ఆ చిన్నారి కొట్టుకులాడుతూ
ఆస్పత్రిలో చేరింది.
సిగ్గులేని దేశపు వ్యవస్థతో
పదిరోజులుగా స్ట్రెచర్ పై పోరాడి
చనిపోయింది.
అకృత్యగాయాల దేహంతో
నాలుక తెగిన
నోటితో
ఆ చిన్నారి
అచ్చం
ఈ దేశపు దౌర్భాగ్యంకి ప్రతీకై కుమిలిపోయింది.
ఘనత వహించిన పోలీసు వారు
అర్ధరాత్రి ఒంటిగంటకి
శవాన్ని గ్రామానికి చేర్చారు.
బిడ్డ శవాన్ని
ఇంట్లోకైనా తీసుకెళ్తాం అని తల్లిదండ్రులు మొత్తుకుంటే
గౌరవంగా నెట్టి లాఠీలతో సన్మానం చేశారు.
వేగుజాము మూడున్నరకి
పోలీసులు, మున్సిపల్ సిబ్బంది దగ్గరుండి దహనం చేశారు.
ఫూలన్ లు పుట్టాలని
మేం కోరుకోవడం లేదు.
దేశానికి
మనిషి స్వభావం అలవర్చమని వేడుకుంటున్నామ్.
చిన్నారి మనీషా..
ఇక్కడ
వాడ ఆడపిల్లగా పుట్టడం నేరమా?
చేతుల్లో
కొడవళ్ళు పట్టుకొని
కోత కొయ్యడం నేర్చుకోకపోవడం నేరమా?.
_ N. Ravi Kumar (Whatsapp)