Atualização do abaixo-assinadoMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

అడవి దొంగకు అడ్డు చెప్పలేదు... వాల్మీకి టైటిల్‌పై గన్ కరెక్టు కాదంటున్నాము

Venkateshwarlu BoyaHyderabad, Índia
1 de fev. de 2019

ఆనాడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కే రాఘ‌వేంద‌ర్ రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ అడ‌వి దొంగ‌కు అడ్డు చెప్ప‌లేదు...ఎందుకంటే అందులో మ‌హ‌ర్షి వాల్మీకి గురించి గొప్ప‌గా ఉంది కాబ‌ట్టి. కానీ నేడు అదే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ గ్యాంగ‌స్ట‌ర్ మూవీకి పేరు పెట్ట‌డ‌మే కాకుండా ఆ టైటిల్ పై ఓ తుపాకీని పెట్టారంటే ఎంట‌ని అర్థం అన్న‌దే మా ప్ర‌శ్న‌. అణ‌గారిన, అట్ట‌డుగు వ‌ర్గాల‌కు స‌హాయం చేయ‌క‌పోగా.. ఇలా పేరు బ‌ద‌లాం చేసే సినిమా ఎందుకంటే అన్న‌దే మా ప్ర‌శ్న‌. మేము ఆనాడు అనాగ‌రికులమే.. కానీ నేడు నాగ‌రికంగా స‌మాజంలో వాల్మీకి జాతి సంత‌తిగా బ‌తుకుతున్నాం. ఈ బ‌తుకుల‌ను కూడా బుగ్గిపాలు చేస్తారా? అన్న‌దే మా ప్ర‌శ్న‌. ఒక‌నాడు ఎస్సీలో ఉన్నాం.. ఆనాడు ఎస్టీలో ఉన్నాం.. నేడు బీసీలోకి లాగారు. ఇంకా రోడ్డుపైకి మా జీవితాలు లాగుతామంటే ఎట్టా ? ఇది త‌గ‌దు. సినిమా వాళ్ల‌కు గానీ, రాజ‌కీయ నాయ‌కుల‌కు గానీ. ఈ స‌మాజంలో పేరుకు మాత్ర‌మే సామాజిక న్యాయం అంటారే తప్ప ఎక్క‌డా అణ‌గ‌తొక్క‌బ‌డిన బ‌డుగు బ‌ల‌హీన‌ వ‌ర్గాల‌మైన వాల్మీకి బోయ‌ల‌ను ఆదుకుందామ‌నే ఇంగిత జ్ఞానం లేదు పాల‌కుల‌కు.. ప‌తితుల‌కు. మా ఆత్మ‌గౌర‌వం మీద దెబ్బ కొడ‌తామంటే ఊరుకుంటామా? ఒక్క‌సారి మా వ‌ర్గం వైపు తొంగి చూడండి.. ఇంకా ఎంత బ‌ల‌హీనంగా ఉన్నారో తెలుస్తుంది. - Venkateswarlu Boya

Copiar link
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X