Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

బోయ‌వాని పౌరుషం త‌గ్గిందా? మ‌నం ఎక్క‌డ ఉన్నాం? మ‌న జాతి ఎక్క‌డ ఉంది? మ‌న‌కు ఎమ్మెల్యే పదవులు వద్దా?

Venkateshwarlu BoyaHyderabad, India
Oct 24, 2018

రెండు తెలుగు రాష్ట్రాల వాల్మీకి బోయ‌ల‌కు మ‌హ‌ర్షి శ్రీ వాల్మీకి జ‌యంతి శుభాకాంక్ష‌లు. 500 బీసీ కాలంలో జీవించిన మహాకవి వాల్మీకిని స్మరించుకుంటున్నాం అందుకు సంతోషం. కానీ అదే వాల్మీకి బోయ జాతి ప్రజల జీవన స్థితిగతులు తెలిసినా కూడా ఎవరూ మందుకు రాని పరిస్థితి. అధికారం లేదు రాజకీయాల్లో లేరు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నది చాలా తక్కువ. మ‌న ఆడ‌బిడ్డ‌ల్ని చెరుస్తారు, మ‌న ఓట్లతో గెలుస్తారు, మ‌న‌మే వాళ్ల ప్రాణాల కోసం ప్రాణాలు తీసుకుంటాము ఎందుకు? కాలం గ‌డుస్తోంది, జాతి అంత‌రిస్తోంది. మ‌న కులం పేరు చెప్పుకొని రుణాలు, ప‌ద‌వులు, ఉద్యోగాలు పొంది బాగుప‌డ్డ వాళ్లు ఎంత‌మందో..? మ‌నం నిజంగా అమాయ‌కులమా? చేత‌గాని వాళ్ల‌మా? పౌరుషం త‌గ్గిందా? పేదరికంలో మగ్గుతున్న వాల్మీకి బోయలు 10 లక్షల పై మాటే. మా పార్టీ, మా నాయకుడు అనే బదులు మన జాతి అని ముందుకు వచ్చే వాళ్లు క‌న‌బ‌డ‌రే.. జాతి అభివృద్ధి కోసం ప‌ని చేసే వాళ్లు అతికొద్దిమంది మాత్ర‌మే వ‌స్తున్నారు. ప్ర‌తి జ‌యంతికి వాల్మీకి ప‌టానికి పూల మాల వేసి ఫోటోల‌కు ఫోజులు ఇవ్వ‌డం త‌ప్ప జాతికి జ‌రిగింది ఏమీ లేదు. ఎవ‌రు బాడుప‌డింది లేదు. ఏపీలో ప‌రిస్థితి రాజ‌కీయ రంగు పులుముకుంటే.. తెలంగాణ‌లో స్వార్థ‌ప‌రుల దారిలో జాతి ప్ర‌జ‌లు న‌డ‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. విద్య‌లేక, అవ‌గాహ‌న లేక చ‌దువుకున్న వాళ్లు ముందుకు రాక బోయ‌లు అతి దుర్భ‌ర జీవితం గ‌డుపుతున్నారు. గ‌తేడాది వాల్మీకి జ‌యంతిలో తెలంగాణ ప్ర‌భుత్వం బోయ‌ల కిచ్చిన హామీలు అమ‌లు చేసిందా? జిల్లాలో వాల్మీకి భ‌వ‌నం క‌ట్టించిండ్రా? ఒక్క ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ద‌క్కించుకోని స్థితిలో బోయ‌లు ఉన్నారు. ఉప్పెనలా ఉద్యమాన్ని తెస్తే ఏ నాయ‌కుడైనా? ఏ పార్టీ అయినా దిగిరావాల్సిందే.. కానీ ఆ ఉద్య‌మాన్ని న‌డిపే వారు ఎవరు? జాతి కోసం నిరంతరం తపించే మీ బోయ జాతి ముద్దు బిడ్డ వెంకటేశ్వర్లు బోయ(జర్నలిస్టు, హైదరాబాద్)

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X