Atualização do abaixo-assinadoMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

ఎస్టీ: ఇంకెన్నాళ్లీ పోరాటం? కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో వాల్మీకిబోయ‌లు యుద్ధం ప్ర‌క‌టించాల్సిందే!

Venkateshwarlu BoyaHyderabad, Índia
30 de jul. de 2018

అయ్య‌లారా.. అమ్మ‌లారా.. అన్న‌లారా.. అక్క‌లారా.. మ‌నo నేడు ఉన్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించండి. ఒక‌రో ఇద్ద‌రో మ‌న వాల్మీకి బోయ‌ల‌లో బాగుప‌డితే బాగుంటుందా.. జాతి మొత్తానికి న్యాయం జ‌రిగే ఎస్టీ కోసం పోరాడితే బాగుంటుందా ఆలోచించుకోండి. ఇప్పుడు రాక‌పోతే ఇంక ఎప్ప‌టికీ రాదు.. రాలేదు. క‌నుక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తాయి. నిధులంటూ ఆశ చూపుతారు. అర‌కొర నిధుల‌తో నడుస్తున్న‌ మ‌న వాల్మీకి బోయ కార్పోరేష‌న్ ల‌ ద్వారా బాగుప‌డింది ఎవ‌రూ లేరు. అందుక‌ని మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం మ‌న త‌రం క‌ష్ట‌ప‌డినా.. భావితరాలు బాగుప‌డాలంటే ఇప్పుడు పోరాడాలి. మన వృత్తి వేట‌.. ఆ వేట‌గాళ్లుగానే గుర్తించ‌మ‌ని ట్రైబల్ హోదా కోర‌డం 100 శాతం న్యాయ‌మే. బీసీలోనో.. ఎంబీసీలోనో ఉంటే మ‌న బ‌తుకులు బాగుప‌డ‌వు. అందుక‌ని బీసీ, ఎంబీసీ గుర్తింపు కాదు కావాల్సింది.. ఫైట్ ఫ‌ర్ ఎస్టీ. ఈ పోరాటంలో గెలుపు మ‌న‌దే కావాలి. మ‌న పోరాటానికి ఎవ‌రు అడ్డు వ‌చ్చినా.. ఓర్పు స‌హ‌నంతో వారికి తెలియ‌జేయండి.. పోరాట‌మంటే ర‌క్తం క‌ళ్ల చూడ‌టం కాదు ధ‌ర్మ‌బ‌ద్ద‌మైన పోరాటం కావాలి. సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ బ‌లం కోసం వాల్మీకి బోయ‌ల ఆత్మ‌గౌర‌వ నినాదంతో ముందు కెళ‌దాం రండి.. స‌మ‌యం లేదు మిత్ర‌మా.. నోరు, నోటు, బ‌లం ఉంటేనే బ‌త‌క‌గ‌లవు. అవి కావాలంటే ఎస్టీ రిజ‌ర్వేష‌న్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో యుద్ధం ప్ర‌క‌టించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఓట్లు అడిగితే మీరు నోట్లు అడ‌గ‌కండి ఎస్టీ రిజ‌ర్వేష‌న్ అడ‌గండి. ఇట్లు మీ బోయ‌ల ముద్దుబిడ్డ‌, జాతి శ్రేయ‌స్సును ఆకాంక్షించే బోయ వెంక‌టేశ్వ‌ర్లు, హైద‌రాబాద్. వివ‌రాల‌కు కాల్ చేయండి 9391204009

Copiar link
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X