Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APబోయ వాల్మీకులను గిరిజన (ST) జాబితాలో చేర్చవద్దనే హక్కు లంబాడా ఎరుకల తెగలకు లేదు: కొంకల వెంకట నారాయణ
Venkateshwarlu BoyaHyderabad, India
Apr 24, 2017
సామాజిక న్యాయం గురించి ప్రతి రోజూ మాట్లాడే గిరిజన సంఘాల నాయకులు ST రిజర్వేషన్ లో దరిదాపులోకి రాని చెంచులు,అదివాసిలు వీరికి కానరా..రా..? 1976 నుంచి ST రిజర్వేషన్ ద్వారా పొందిన ఉద్యోగాలలో ఎవరివాటా ఎంతో తెలియదా ? .....ఈ రిజర్వేషన్లు ఉపయోగించి మొత్తం ఉద్యోగాలు కొల్లగొట్టిన వాళ్లువరో విజ్ఞులైన దళిత బహుజన వర్గాల పరిశీలనలో అందరికీ తెలిసిందే. "బోయ వాల్మీకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభా 3,53,000 ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సమగ్ర సర్వే రిపోర్ట్ ఆధారంగా. బోయవాల్మీకులు... కేవలం 0.92% .వాస్తవాలను వక్రీకరిస్తూ వాల్మీకి బోయలు 4% ఉన్నారనీ తప్పుడు సమాచారంతో కరపత్రాలు పంపిణీ చెయ్యటం జరుగుతోంది .ఇలాంటి తప్పుడు వాదనలతో ప్రజలను కొంత వరకు మభ్యపెట్టవచ్చు.. కానీ స్థిరంగా నిలువదు అనేది గుర్తిస్తే మంచిది...దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా.. తెలంగాణ ప్రాంతం నుండి వాల్మీకి బోయలలో ఇంతవరకు ఒక IAS,గానీ IPS లాంటి ఉద్యోగులు లేరు...పోనీ ఇప్పటి వాల్మీకి బోయ కులంలో ఒక RDO గానీ DSP స్థాయి అదికారి కానీ రిక్రూట్ మెంట్ కాలేదు...అంటే ఉద్యోగ పరంగా సాధించిన అబివృద్ది ఎంతో చెప్పకనే చెప్పవచ్చు..వాస్తవాలకు విరుద్దంగా వాల్మీకి బోయలు విద్య, ఉద్యోగాలలో సామాజికంగా ఆర్థికంగా ఎంతో అబివృద్ది చెందారనీ గిరిజన సంఘాల జేఎసి తప్పుడు సమాచారంతో కరపత్రాలు విడుదల చేస్తున్నది..ముఖ్యంగా లంబాడా IAS ,IPS లు ఎంత మంది ఉన్నారో....MLA లు MP లు MLC లు కార్పోరేషన్ చైర్మేన్ లు ఇప్పటి దాకా ఎంత మంది అయ్యిండ్రో ....?మీతోటి గిరిజనులైనా అదివాసిలు ,చెంచులు ,ఎరుకల వంటి 33 తెగలకు సంబందించిన వర్గాల IAS,IPS,MPలు,MLA లు ఎంతమంది ఉన్నారో విద్య ఉద్యోగ సామాజికంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ది సాదించరో ఈ గిరిజన సంఘాల ఐక్య కార్యచరణ కమిటి ముందుగా చర్చ చేస్తే సభ్యసమాజం గర్వపడుతుంది...ఇంకొక్క విషయం 1956 కన్నా ముందు వాల్మీకి బోయలు ST (గిరిజన జాబితాలో)లు గా ఉన్నారన్న విషయం మరచిపోవద్దు...ఇండియా వ్యాప్తంగా తూర్పు ఈశాన్య రాష్ట్రాల లో వాల్మీకి బోయలు ST లు కర్ణాటక లో STలు బీహారు పంజాబ్ ,హర్యానా, ఉత్తరప్రదేశ్ ,తదితర రాష్ట్రాలలో SC జాబితా లో ఉన్నారు..ఈవాస్తవాన్ని చూడ కుండా BC కులాలను ST జాబితాలో చేర్చవద్దనే హక్కు లంబాడా ఎరుకల తెగలకు లేదు. వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు శాతం పెంచమని డిమాండ్ చెయ్యడం హుందాగా ఉంటుంది...అంతే కాని తప్పుడు సమాచారంతో వాస్తవాలకు దూరంగా ప్రజలను నమ్మించాలనుకోవడం రెండు వర్గాల మధ్య కొత్త వివాదాలను ప్రేరెేపించడమే అవుతుంది...@ Konkala Venkat Narayana సామాజిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు(వనపర్తి)
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X