Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APబోయ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం.. రిజర్వేషన్ 6 నుంచి 10 శాతానికి పెంపు
Venkateshwarlu BoyaHyderabad, India
16 abr 2017
గిరిజన, బీసీఈ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్ల పెంపు, మైనార్టీలకు 4 నుంచి 12 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు శాసనసభలో సీఎం కేసీఆర్ గిరిజనులు, బీసీ-ఈ వర్గాలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టారు. సీఎం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల బిల్లు పెంపుపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్రం సాకారంతో రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు సీఎం కేసీఆర్. కాదంటే లోక్ సభలో దీనిపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టామన్న సీఎం… బ్రిటిష్ కాలం నుంచి రిజర్వేషన్లున్నాయన్నారు. నిజాంను ఒప్పించి భాగ్యరెడ్డి వర్మ రిజర్వేషన్లు సాధించారన్నారు. ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని ప్రశ్నించారు సీఎం. సీపీఎం నేతలు కొన్ని కులాలను ఎస్టీలో కలపొద్దంటున్నారు. మనం పంపే బిల్లులు కేంద్రంలో యధాతథంగా పాస్ కాదన్నారు. కేంద్రంలోని అన్ని శాఖలు మార్పు చేర్పులు చేస్తాయి బీసీల రిజర్వేషన్ అమలుకు సమయం పడుతుందన్నారు సీఎం కేసీఆర్. ఎంబీసీ కులాలపై సమగ్ర నివేదిక కోరాం. రిజర్వేషన్ 50 శాతమే ఉండాలని సుప్రీం కోర్టు చెప్పలేదన్నారు. కేంద్ర జాప్యం చేస్తే సుప్రీం కోర్టుకు వెళతాం. రిజర్వేషన్ లపై లోక సభలో నిలదీస్తాం అన్నారు ముస్లిం, గిరిజన రిజర్వేషన్ లపై సభలో చర్చించారు సభ్యులు. బీసీ రిజర్వేషన్ లు పెంచడానికి ప్రభుత్వం కట్టుబడింది. ఎస్సీలకు 1 శాతం రిజర్వేషన్ లను తప్పకుండా కల్పిస్తామన్నారు సీఎం. Source:v6news.tv
Copiar enlace
WhatsApp
Facebook
X
Email