Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
తెలంగాణలో ఎస్టీలోకి బోయలు.. ఇది సగం ఆనందం మాత్రమే..!

Venkateshwarlu BoyaHyderabad, India

15 Apr 2017
వాల్మీకి బోయల చిరకాల వాంఛ ఎస్టీ హోదాపై తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్గం ఆమోదం తెలిపి.. ఒక అడుగు ముందుకు పడింది. రేపు అసెంబ్లీ తీర్మానం జరుతుంది. అనంతరం కేంద్రానికి పంపుతారు. ఫైనల్ గా కేంద్రమే ఆమోదించాలి గనుక... మరో ఏడాది వెయిట్ అండ్ సీ ధోరణిలోనే ఉండాల్సిన పరిస్థితి. కానీ కేసీఆర్ సర్కార్ ముస్లిం రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడం వలన కేంద్రం ఆమోదం తెలుపుతుందా? అన్న మీమాంస బోయల మదిలో మెదులుతోంది. ఈ తొలి మెట్టులో విజయం సాధించడానికి సహకరించిన డాక్టర్ చెల్లప్ప కమిషన్ సభ్యులకు, మంత్రులకు, కేసీఆర్ కు జాతి పోరాటంలో పాల్గొన్న వాళ్లకు, అందుకు సహాయం చేసిన బోయజాతి పెద్దలందరికీ ధన్యవాదాలు.
రాష్ట్ర కేబినెట్ వాల్మీకి బోయలు, ఖైయితీ లంబాడాలను ఎస్టీలుగా గుర్తించాలని మంత్రి వర్గం ఆమోదం తెలిపినందుకు బోయల అంతిమ పోరాట ఫలితం కొంతవరకు ఫలించిందనే చెప్పాలి.
ఇక ఏపీ ప్రభుత్వంలో కూడా ఇదే కదలిక వస్తే కేంద్రంపై కలిసి ఒత్తిడి తీసుకరావచ్చు. ఎందుకంటే మినిష్టర్ కాల్వ శ్రీనివాసులు అన్నగారు వచ్చే అక్బోబర్ 5 నాటికి ఏపీలో వాల్మీకులు ఎస్టీలుగా గుర్తిస్తాం అన్నట్టు గుర్తు.
వాట్సాప్, ఫేస్ బుక్, ఫోన్ లో శుభాకాంక్షలు తెలిపిన బోయ బంధువులందరికీ నా ధన్యవాదాలు
ఇట్లు
బోయజాతి ముద్దుబిడ్డ
బోయ వెంకటేశ్వర్లు
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X