Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

డా.చెల్లప్ప కమిషన్ రిపోర్టుకు మంత్రివర్గం ఆమోదం: కమిషన్ వాల్మీకీ బోయలను ఎస్టీలో కలపమని చెప్పిందా?

Venkateshwarlu BoyaHyderabad, India
12 Apr 2017
తెలంగాణ ఏర్పడక ముందు.. 107 సభలలో ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పామన్నారు సీఎం కేసీఆర్. 119 మంది ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. ముస్లిం, గిరిజన రిజర్వేషన్ ల అమలుకు సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ వేశాం. కమిషన్ ల రిపోర్టులు ప్రభుత్వానికి అందాయి. చెల్లప్ప కమిషన్ రిపోర్టును,సుధీర్ కమిషన్ రిపోర్టులకు మంత్రిమండలి ఆమోదం లభించిందన్నారు సీఎం కేసీఆర్. బీసీ కమిషన్ ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా వెనకడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మంత్రి వర్గం ఆమెదం తెలిపింది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు అసెంబ్లీని ఏప్రిల్ 16న 2 గంటలకు సమావేశం, 4 గంటలకు బీఎసీ సమావేశం. మంత్రుల అధ్యయనం అనంతరం ఏప్రిల్ 15న ఎస్టీలకు ఎంత శాతం, ముస్లింలకు ఎంత శాతం అనేది ప్రకటిస్తామన్నారు సీఎం. ఇవి మతపరమైన రిజర్వేషన్ లు కావన్నారు. ముస్లింలలో ఇదివరకు దూదెకులకు 1శాతం, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ను జనాభా ప్రాతిపదికన 12 శాతానికి పెంచమని అడుగుతున్నాం. రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రంలో ఒక విధంగా రిజర్వేషన్ లు ఉండడం సబబు కాదన్నారు సీఎం. ఎస్టీలు రాజ్యాంగ బద్ధంగానే షెడ్యూల్ ట్రైబ్స్.. 50 శాతం కంటే ఎక్కువ తమిళనాడు 69, జార్ఖండ్ 60 అలాగే అరుణాచల్ ప్రదేశ్ , మేఘాలయ, మిజోరం గిరిజనులకు 80 శాతం రిజర్వేషన్ అమలులో ఉంది. రాజస్థాన్ 68 శాతం పెంచాలని.. తీర్మానించి కేంద్రానికి పంపింది. తమిళనాడులో 32 ఏళ్ల నుంచి 69 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. ఇప్పుడు తెలంగాణకు కూడా రిజర్వేషన్ పెంచాలని కేంద్రాన్ని కోరుతాం. స్వాతంత్రం వచ్చినాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మాది కొత్త రాష్ట్రం. ఈ దేశం సురక్షితంగా 100 శాతం ఉండాలంటే.. తమిళానడుకున్న వెలుసుబాటు తెలంగాణకు ఇవ్వండని కోరుతున్నామన్నారు. పశ్చిమ బెంగాల్,కేరళ, మణిపూర్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ పొందవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఉంది.1953లో మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సామాజిక స్వరూపాన్ని అనుగుణంగా జనాభా ప్రాతిపదికన ఎంబీసీలలో చేతి వృత్తుల వాళ్లు ఎంతమంది ఉన్నారు. సంచార జాతుల స్థితిగతులు, తెలంగాణ బీసీ కమిషన్ సమగ్ర అధ్యయంన చేస్తోంది. బీసీల రిజర్వేషన్ పెంపు కూడా ఆలోచిస్తాం.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X