Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
ఇవాళ జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చే ఫైలుకు ఆమోదం తెలుపుతారా?

Venkateshwarlu BoyaHyderabad, India

12 abr 2017
గిరిజనుల రిజర్వేషన్ పదా? పన్నెండా?
-ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుదలకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఎవరికెంత మేరకు పెంచాలనే అంశంపై అంతర్మథనంలో ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు వర్గాలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేస్తామని తెరాస ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. గిరిజనులపై చెల్లప్ప కమిషన్, ముస్లింలపై తాజాగా బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికల పరిశీలన అనంతరం సందిగ్ధంలో పడినట్లు తెలిసింది.
12 శాతమైతే జనాభా మొత్తానికి రిజర్వేషన్లే: మంగళవారం బీసీ కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం తెలంగాణలో 2011 లెక్కల ప్రకారం ముస్లింల జనాభా 12.68 శాతం. ప్రభుత్వం 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే అందరికీ వర్తిస్తాయి. ఇలాంటి పరిణామం ఎక్కడా జరగలేదు. ముస్లింలలో 80 శాతం మేరకు పేదలుంటారని బీసీ కమిషన్ తన నివేదికలో తేల్చింది. ఈ ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సమస్యాత్మకంగా మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు కొంత మంది అధికారులు సందేహాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో 12 శాతం గాకుండా కొంత తగ్గించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం. అది పది శాతమా లేక 11 శాతమా అన్నది బుధవారం మంత్రిమండలి సమావేశంలో తేలే అవకాశం ఉంది.
గిరిజనులకూ ఇదే సమస్య
గిరిజనులకూ 12 శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఇలాంటి సమస్యే ఉంది. 2011 జనాభా లెక్కల మేరకు తెలంగాణలో గిరిజన జనాభా 9.08 శాతం. వాల్మీకి బోయలు, కాయితీ లంబాడీలను ఎస్టీ జాబితాలో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెల్లప్ప కమిషన్ అధ్యయనం తర్వాత ఈ రెండు వర్గాల జనాభా 0.92 శాతమేనని తేలింది. అంటే ప్రస్తుతం ఉన్న వారిని, కొత్తగా కలిపే వారిని పరిగణనలోనికి తీసుకుంటే మొత్తం 10 శాతం దాటడం లేదని కమిషన్ గుర్తించింది. దీంతో వీరికి ఎంత రిజర్వేషన్ అమలు చేయాలా అని ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. జనాభా ప్రాతిపదికనైతే గిరిజనుల రిజర్వేషన్లను 9 శాతం (ప్రస్తుతం ఆరు శాతంగా ఉంది), వాల్మీకి బోయలు, కాయితీ లంబాడీలను కలపాలనుకుంటే 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుందన్న కమిషన్ లెక్కలపై మంగళవారం ఉన్నతస్థాయిలో చర్చించారు. దీనిపైనా మంత్రిమండలిలోనే స్పష్టత వచ్చే వీలుంది.
Source: Eenadu.net
Apoyar ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
X
Email