Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
సంక్షేమ బడ్జెట్ సరే.. మరి వాల్మీకి బోయలకేంది? కులవృత్తి ఉన్నవాళ్లకు పట్టం.. లేని బోయలకు మొండిచెయ్యా?

Venkateshwarlu BoyaHyderabad, India

13 mar 2017
మిష్టర్ సీఎంగారూ.. వాల్మీకి బోయలను ఎస్టీలో చేరుస్తామని చెప్పి..ఇవాళ (మార్చి 13) ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్ సెషన్ లో వాల్మీకి బోయలను ఎస్టీ లో చేర్చే అంశం పరిశీలిస్తామనడంలో మీ అంతర్యమేమిటో అర్థం కావడంలేదు. గత రెండేళ్ల నుంచి చెల్లప్ప కమిటీ అదే పనిలో ఉందన్న విషయం మరిచిపోయారు. ఇంకా ఎంత సమయం కావాలి. ఇప్పటికే చెల్లప్ప కమిషన్ కాలాన్ని 4వసారి పెంచారు. ఈ సమయం సరిపోలేదా? దేశంలోని మిగతా రాష్ట్రాలలో మాజాతి ఎస్సీ, ఎస్టీలుగా లబ్దిపొందుతుంటే ఇక్కడ మాత్రం తరతరాలుగా నష్టపోతూనే ఉన్నాం. గత 60 ఏళ్లుగా ముత్తాతల మాటలు వినలేదు, తాతలు, తండ్రుల మాటవినలేదు. ఇప్పుడు మా మాట కూడా వినరా? అనుకువగా ఉన్నామని అలుసుగా తీసుకుంటే... పోరాటమే తరువాయి.
సర్..దయ ఉంచి మీరు కూడా గత ప్రభుత్వ నాయకులు చేసినట్టు చేయకండని మనవి. బోయజాతి వాళ్లు నమ్మితే ప్రాణం ఇస్తరు. మీపై ఉన్న ఆ నమ్మకాన్ని నీరు గార్చకండి.
Apoya la petición ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X