Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APచెల్లప్ప కమిషన్ ఫైనల్ రిపోర్టు ఎప్పుడు వస్తుంది?
Venkateshwarlu BoyaHyderabad, India
13 mar 2017
చెల్లప్ప కమిషన్ తుది నివేదిక అందిన తర్వాత వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చే అంశం పరిశీలిస్తాం అన్నారంటే ప్రభుత్వం మరోసారి రాష్ట్ర వాల్మీకి బోయలను వంచించే ప్రయత్నం చేస్తోందన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే అప్పుడేమో అత్యంత వెనకబడి ఉన్నారు.. గత ప్రభుత్వాలు మోసం చేశాయి. టీఆర్ ఎస్ ప్రభుత్వం తప్పకుండా వాల్మీకి బోయలను ఎస్టీలో చేరుస్తాం అని హామి ఇచ్చి ఇప్పుడేమో పరిశీలిస్తున్నాం అంటున్నారు. కాబట్టి వాల్మీకి బోయ సోదరులారా జాగరుకులుగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ బడ్జెట్ సెషన్ లోనే ఎస్టీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెడతాం అన్నారు.. చెల్లప్ప కమిటీ రిపోర్టు(పూర్తి నివేదిక) ఆలోగా వస్తుందా? అన్న సందేహం కలుగుతోంది. వస్తే సరి లేదంటే పోరాటమే. బడ్జెట్ సెషన్ అయిపోయేదాకా వేచి చూడటం మంచిది తొందరపడి పాలాభిషేకాలు, ఊకదంపుడు స్పీచ్ లు, ఫోటోలు పెట్టకండని మనవి ఇట్లు వాల్మీకి బోయజాతి కాంక్షించే మీ.. వెంకటేశ్వర్లు బోయ
Apoya la petición ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X