Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APచెల్ల‌ప్ప రిపోర్టు ఇచ్చాక కూడా.. నోరు మెద‌ప‌ని బోయ కుల సంఘ నేత‌లు..ఏం?
Venkateshwarlu BoyaHyderabad, India
Sep 1, 2016
ఏమ‌య్యా వాల్మీకి కుల సంఘ నేతలు..ఇన్నాళ్లు బాగానే కులానికి పెద్ద‌లం మేమే అని చెప్పుకొని తిరిగారు. చెల్ల‌ప్ప క‌మిటీ పేరు చెప్పి ఇన్నాళ్లు ప‌బ్బం గడిపారు. ఇప్పుడేమైంది. నోరు పెగ‌ల‌డం లేదెందుకో మరి. నిజంగా బోయ జాతికి మేలు చేయాల‌నుకుంటే అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయ‌కుల‌ను చూసి సిగ్గు తెచ్చుకోండి. ముద్రగ‌డ్డ‌ ప‌ద్మ‌నాభం ఏవిధంగా కాపుకులానికి నాయ‌కుడుగా నిలిచిండో అలా మీరెందుకు రాలేక‌పోతున్నారు అర్థం కావ‌డం లేదు. క‌నీసం ఇప్పుడైనా నాయ‌కులుగా ఆలోచించండి. రాబోయే పిల్ల‌ల‌నా బాగు ప‌డేలా.. మీరు మాజాతి ర‌త్నాల‌ను చెప్పుకొనేలా ఎదురొడ్డి నిల‌బ‌డండి. తరతరాలుగా మోసపోతున్న మన బోయజాతి పరువు ఈసారైనా నిలబెట్టండి ప్లీజ్. రండి కనీసం చేసేవాళ్లకైనా అండగా ఉండండి.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X