Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి బోయ‌ల ఆత్మ‌గౌర‌వ స‌భలో ప్ర‌భుత్వం ముందు వెంక‌టేశ్వ‌ర్లు 5 డిమాండ్లు!
Venkateshwarlu BoyaHyderabad, India
21 mar 2016
1. మన బోయ కులాన్ని ఎస్టీలో చేర్చాలి! 2. కుల వృత్తిలేని బోయలకు బీడీ కార్మికులలాగా జీవన భృతిని అందించాలి 3. వాల్మీకి బోయలకు 100 ఎకరాల్లో అ. ఒక కమ్యునిటీ హాల్ ఆ. బోయ విద్యార్థిని విద్యార్థుల కోసం ప్రత్యేక వాల్మీకి గురుకుల హాస్టల్ ఇ. వితంతువులు, దిక్కుమొక్కులేని ఆడపిల్లలకు ఉపాధి శిక్షణ కేంద్రం ఈ. అంతరించి పోతున్న బోయ జాతి సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధాన పరిశోధనలకు వాల్మీకి పరిశోధనా అధ్యయన కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలి ఉ. వాల్మీకి ఫెడ్ రేషన్ కు 100 కోట్ల నిధిని ఏర్పాటు చేసి వాళ్లకే ఉపయోగ పడేలా చేయాలి 4. ట్యాంక్ బండ్ పై లేదా హైద్రాబాద్ లో ఇచ్చే 100 ఎకరాల్లో వాల్మీకి మందిరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలి. ఎందుకంటే ఉత్తర, దక్షిణ భారత దేశంలో వాల్మీకులు వివిధ అనేక జాతులుగా ఉన్నారు. వాళ్ల వల్ల తెలంగాణ రాష్టానికి ఒక సమ్మక్క సారలమ్మ, నాగోబా జాతరల లాగా వాల్మీకి మందిర నిర్మాణం వల్ల పర్యాటక ఆదాయం కూడా వస్తుంది కనుక. 5. బోయలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న 5 డిమాండ్లను వాల్మీకి బోయ‌ల ఆత్మ గౌర‌వ దీక్ష‌తో నేను ఈ ప్ర‌భుత్వాన్ని అమ‌లు చేయాలని బోయ‌ల ఆత్మ‌గౌర‌వ స‌భ సాక్షిగా డిమాండ్ చేస్తున్నాను. - Venkateswarlu Boya
Apoya la petición ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X