Request for hike in salaries of Andhra Pradesh Volunteers

The Issue

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్యుల కు నమస్కారం!

అయ్యా! ఆనాడు గాంధీజీ కన్న కల నేడు సాకారం దిశగా గ్రామీణ భారతాన్ని పటిష్టం చేసే దిశగా, మీరు స్థాపించిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థకు శతకోటి వందనాలు. ప్రతి గ్రామం నుండి ప్రతి పట్టణం లోని వార్డు నుండి సమర్థవంతంగా పటిష్టమైన పరిపాలన సాగాలనే దృక్పథంతో మీరు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థకు జై కొడుతూ నేను సైతం అంటూ ఎందరో మాలాంటి ఔత్సాహికులు మీ సేవలో పాలు పంచుకోవాలని వాలంటీర్లగా అవతరించి రాష్ట్ర నలువైపులా మా సేవలను నేడు అందిస్తున్నాము.

ఎండనక, వాననక, రేయనక, పగలనక ఎంతో శ్రమిస్తూ అందరికీ ఉపకారం చేస్తూ ముందుకు సాగుతున్నాము.కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైన , ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయాలలో కూడా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా మేము మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాం.

వాలంటీర్ వ్యవస్థలో కాలక్రమేణా కొన్ని మార్పులు వచ్చాయి. మరిన్ని బాధ్యతలు పెరిగాయి. క్లిష్ట పరిస్థితుల్లో ఇంకా పని భారం పెరిగింది. తీరిక లేకున్నా  రాష్ట్రం కోసం సైనికుడిలా ముందుకు సాగుతున్నాం.

పెరిగిన బాధ్యతలు , పని వలన మేము పూర్తిగా వాలంటీర్ బాధ్యతలు కే అంకితమయ్యాము. వేరే చిన్నా చితకా పనులు చేసుకునే మాకు ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగం ఒక్కటే ఆదరువు. 

గౌరవ ముఖ్యమంత్రి మరియు మంత్రివర్యుల కు విన్నవిస్తున్నది ఏమనగా, మా కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను సవరించి మా జీవితాలలో వెలుగులు నింపాలని అభ్యర్థిస్తున్నాము! తద్వారా మరింత సమర్థవంతంగా మా జీవితాలను ప్రభుత్వ సేవలకి అంకితం చేస్తాము అని సగర్వంగా తెలియజేస్తున్నాం.

మీరు తప్పకుండా స్పందించి మమ్మల్ని ఆదుకుంటారని భావిస్తూ...

ఇట్లు,

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్!

avatar of the starter
Manohar GuptaPetition Starter
This petition had 2,687 supporters

Petition Updates