CM KCR గారు: తెలంగాణ మహిళా కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయగలరు #WomComMatters

This petition had 35,094 supporters

The Issue

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు, మహిళల హక్కులు మరియు ఆందోళనలపై నూతన దృష్టి సరిస్తారని ఆశించాను. కానీ జూలై 2018 నాటికి, నన్ను నిరాశపరిచే ఆశ్చర్యకర వాస్తవాలు వెలువడ్డాయి. ఇవి మన రాష్ట్రం మరియు దేశంలోని ప్రజాకోటిని కూడా కలచివేశాయి.

  • మహిళలపై నేరాల జాబితాలో భారతదేశంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది (ఎన్‌సిడబ్ల్యు, 2017)
  • తెలంగాణలో 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న 45% మంది మహిళలు, శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొన్నట్టు ఈ సర్వేలో వెలువడింది (NFHS).
  • 'తను కోరుకుంటుంది' అన్న కారణం చేతే ఒక అమ్మాయి వేధింపులకు గురవుతుందని తెలంగాణలోని 44% మంది బాలురు మరియు తల్లిదండ్రులు భావిస్తున్నారు (WINGS 2018)

తెలంగాణలో నివసిస్తున్న ఒక మహిళగా, నేను భయపడ్డాను, ఆగ్రహానికి లోనయ్యాను మరియు నిరుత్సాహపడ్డాను - కాని మహిళల సాధికారిత కోసం భరోసా కేంద్రాలు మరియు షీ టీమ్స్ బృందాలతో తెలంగాణ కృషి చేస్తోందని సాటి పౌరురాలిగా నేను గుర్తించాను.

అయినప్పటికీ, తప్పు ఎక్కడ జరుగుతుంది? సమస్య ఏమిటంటే, మహిళా హక్కుల సమస్యలను సమాజ సమస్యలుగా పరిగణించరు. మహిళల పట్ల సమానత్వం, సమాయత్వం ఎందుకు లేవు? మహిళా సాధికారతకై ముందడుగు వేసే అధికారం ఎవరికి ఉంది?

ఈ విషయం పట్ల పరిశోధించగా, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం, 1998 ను తెలంగాణ రాష్ట్రానికి ‘తెలంగాణ మహిళల కమిషన్ చట్టం, 2016’ గా స్వీకరించారని నేను గ్రహించాను. మహిళల స్థాయిని మెరుగుపరచడం, మహిళలను ప్రభావితం చేసే అధర్మమైన పద్ధతులపై ఆరా తీయడం, పరిష్కారపరమైన శాసన చర్యలను సిఫారసు చేయడం మరియు ప్రభుత్వానికి తగు సలహాలందించడం దీని ఏకైక ఉద్దేశ్యం. ఇప్పుడున్న పరిస్థితులకు ఇది అత్యవసరమైన విషయం అని నేను నమ్ముతున్నాను. మాలో ఎంతో మంది లింగ వివక్షను వ్యతిరేకిస్తూ, సమానత్వం సాధించడం కోసం పరితపిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌తో స్వయంసేవకంగా పనిచేయడం దానికి నాంది అని భావిస్తున్నాము. కానీ, నా ఆశ్చర్యానికి, వెబ్‌సైట్ లేదు! సమాచారానికి ప్రాప్యత లేదు! ఏమిలేదు! ముఖ్యంగా, జూలై, 2018 నుండి మహిళా కమిషన్ లేదు.

మనం ఏకమై, ఈ పిటిషన్ పై సంతకం చేసి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని మరియు ఐటి మంత్రి గారిని తక్షణమే ఈ క్రింది విషయాల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కోరుదాం.

  • ఛైర్‌పర్సన్‌ను నియమించి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ను పూర్తిగా పనిచేసేలా చేయండి; మరియు
  • తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్ ప్రచురించండి.

భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, తన పురోగతికి, ముఖ్యంగా ఐటి రంగంలో అభివృద్ధికి ఇప్పటికే గుర్తింపు పొందింది. చెట్లు మరియు గొర్రెలు కూడా తెలంగాణ పథకాల క్రింద డిజిటల్ ఉనికిని కలిగి ఉన్నాయి !! కానీ, రాష్ట్ర మహిళా కమిషన్ కోసం మాత్రం వెబ్‌సైట్ లేకపోవడం ఆశ్చర్యకరం.

కర్ణాటక మరియు కేరళ వంటి రాష్ట్రాలు తమ కార్యకలాపాలు, స్వయంసేవక అవకాశాలు, వార్షిక నివేదికలు, చట్టపరమైన పత్రాలు మరియు ఇతర సంబంధిత డేటాపై సమగ్ర సమాచారంతో పూర్తిస్థాయిలో పనిచేసే ఆన్‌లైన్ పోర్టల్‌ను కలిగి ఉన్నాయి.

రాష్ట్ర మహిళా కమిషన్ యొక్క దృశ్యమానత, పారదర్శకత మరియు జవాబుదారీతనం తో మహిళల భద్రత పట్ల నిబద్ధత కోసం తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించడంలో సహాయపడదాం.

సమాచార హక్కు చట్టం, 2005 లోని సెక్షన్ 4 (2) ప్రకారం, వెబ్‌సైట్ ను నిర్మించి నియమించడం కూడా చట్టబద్ధమైన ఆదేశం అవుతుంది.

మహిళల శ్రేయస్సు మరియు భద్రత కోసం తెలంగాణ మరో అడుగు ముందుకు వేయడానికి కలిసి సహాయం చేద్దాం.

avatar of the starter
Spurthi KolipakaPetition StarterEngineer turned Social Worker.

The Decision Makers

KCR
KCR
Chief Minister, Telangana
KTR
KTR
IT Minister
Satyavathi Rathod
Satyavathi Rathod
Minister, Department of Women and Child Welfare

Petition Updates

Share this petition

Petition created on 11 November 2020