Petition updateSave V M Home (Victoria Memorial Home Residential School, Saroornagar, Hyderabad) Lands

Save VMHome: తరుగుతున్న వీఎంహోం ఆస్తులు.. తగ్గుతున్న విద్యార్థులు ఇది దేనికి సంకేతం?

Victoria Memorial Home
12 Apr 2022

నేను వీఎంహోం పూర్వ విద్యార్థి వేంకటేశ్వర్లు బోయ, గద్వాల్. ఏప్రిల్ 2022 లో వీఎంహోం స్కూల్ ను 5 ఏళ్లకు సందర్శించడం జరిగింది. అక్కడి విద్యార్థులను, స్టాఫ్ ను కలవడం జరిగింది. స్కూల్ విద్యార్థులు భోజనం సరిగా పెట్టడం లేదు అని నాకు చెప్పడం జరిగింది. చాలా మంది విద్యార్థులు టిఫిన్, లంచ్ సరిగా లేక వెళ్లిపోవడం జరిగిందని చెప్పారు. ఇంచార్జి మేడం పార్వతి గారు కోవిడ్ వల్ల ఇంటికి వెళ్లారు తిరిగి రాలేదు అని సమాధానం ఇచ్చారు. వీరిలో ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా స్వతంత్ర ప్రతిపత్తి గల ఈ అనాధ విద్యార్థుల విద్యాలయాన్ని చుట్టు ప్రక్కల ప్రజలు, పూర్వ విద్యార్ధులు, వాకర్స్ అందరూ అమ్ముడుపోని ఒక పరిరక్షణ వేదిక ఏర్పాటు చేసుకొని  కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(https://telanganajournalist.tumblr.com/post/680296117928345600/save-vmhome

ఇట్లు

వేంకటేశ్వర్లు బోయ, సీనియర్ జర్నలిస్ట్, గద్వాల్

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X