Kampanya güncellemesiNo Religion No Caste .. One More Option Please..
Hearty Thanks to Suvarna Kumar garu for His Write up on No Religion No Caste Option Issue !

RAMAKRISHNA RAO D.V.Hyderabad, TG, Inde

21 mars 2018
భారతదేశ సామాజిక విప్లవానికి మేనిఫెస్టోగా భావించే అంబేద్కర్ ANNIHILATION OF CASTE రూపొంది ఎనిమిది దశాబ్దాలు(1936) గడచిపోయాయి. చిన్నపాటి మినహాయింపులతో ఎక్కడ వేసిన కులం గొంగడి అక్కడే ఉందనుకోవచ్చు. ఇంత సుదీర్ఘ కాలంలో రావాల్సినంత మార్పు రాలేదు. ఆ మార్పుకోసం జరగాల్సినంత కృషి జరగలేదనీ, జరిగినంతలోనూ చిత్తశుద్ది లోపించిందని కూడా అంగీకరించాలి. ఇన్నేళ్ల చరిత్రను తవ్విపోసుకోవడం కాదుగానీ, ఒక విషయంలో మన ఉదాసీనత/నిజాయితీరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
కుల నిర్మూలనకు ఒక ప్రధానమైన పరిష్కారంగా అంబేద్కర్ సూచించింది కులాంతర వివాహాలు. వీటివల్ల రెండు కులాలు తక్షణం రద్దవుతాయి. వాళ్లిద్దరితో అది సంపూర్ణం కాకపోయినా వాళ్ల పిల్లలతో కులం చావక తప్పదు. కానీ అలా జరగుతోందా? జరగకపోతే ఎందుకు జరగడంలేదు?
కులాంతర వివాహాలతో కులం రద్దు కాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటిః ఆ వివాహం చేసుకున్నవాళ్లు దాన్నొక విలువగా/అవగాహనగా కాకుండా తాత్కాలిక అవసరంగా భావించడం వల్ల. ఎక్కువ సందర్బాల్లో మగవాడి కులమే ఆ జంట కులంగా, వారికి పుట్టే బిడ్డల కులంగా నిలబడిపోతోంది. రెండో కారణం, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తాము కులాల రొంపి నుంచి బయటపడ్డామని ప్రకటించుకునే వీలు లేకపోవడం. కుల రహితులకు ఎలాంటి చట్టపరమైన గుర్తింపూ లేదు. చైతన్యంతో కులాలను తిరస్కరించినా నిత్య జీవితంలో అవి నీడలా వెంటాడి వేధిస్తున్నాయి. ఆ భూతాన్ని శాశ్వతంగా బొందపెట్టే చట్టపరమైన రక్షణలు కరువయ్యాయి. మతం విషయమూ దాదాపు సేమ్ టు సేమ్.
ఈ అవస్థకు అద్దంపట్టే క్లాసిక్ ఎగ్జాంపుల్ డి.వి.రామకృష్ణారావు(రాంకీ), క్లారెన్స్ కృపాళినిల కేసు. అతను హిందూ మతానికి చెందిన బ్రాహ్మణ కులం నుంచి వచ్చినవాడు. ఆమె క్రైస్తవాన్ని స్వీకరించిన మాల కులస్తురాలు. రెండు భిన్న మతాలు రెండు భిన్న కులాలు. మనుషులుగా ఆ ఇద్దరూ కలవకుండా కులమతాలు ఆపలేకపోయాయి. పూర్వాశ్రమంలో వాళ్ల అస్తిత్వాలు ఎలా ఉన్నా…వర్తమానంలో వాటికి అతీతమైన చైతన్యంతో బతికే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్లది ఏ మతం? వాళ్లది ఏ కులం? అసలు ఆ రెండూ మిగిలాయా లేక రద్దయిపోయాయా? రద్దయిపోయాయనే భావించారు తల్లిదండ్రులు. తమకున్నకులమత అస్తిత్వ అవశేషాలు పిల్లలకు ఉండకూడదనుకున్నారు. వాళ్లను కులమతాలకు అతీతంగా పెంచాలనుకున్నారు. అది అంత ఈజీ కాదని త్వరలోనే తెలుసుకున్నారు.
చాలా మందికి మంచీ చెడూ తెలుసు. కానీ, నిలబడరు కలబడరు. కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుంటారు. రాంకీ అలాంటి మాటల మనిషి కారు. ఈ కులమతాల అంతు చూడాలనుకున్నారు. తన పిల్లలకు ఒక ప్రజాస్వామిక అస్తిత్వంకోసం పోరు ప్రారంభించారు. ఆ పోరు నేడు కీలకమైన దశకు చేరుకుంది. తోలు మందం వ్యవస్థ ఒక పట్టాన స్పందించనంటోంది.
పిల్లల చదువుల దగ్గర మొదలైంది రాంకీ పోరాటం. స్కూళ్లలో కులమతాల వివరాలను నింపాల్సిన ప్రతిసారీ ఆయన పోరాడుతూ వచ్చారు. కొన్నిసార్లు గెలిచారు. మరికొన్ని సార్లు విసుగెత్తి రాజీపడ్డారు. పెద్ద కూతురు పదోతరగతికి వచ్చినప్పుడు ఈ పోరాటాన్ని ఉధృతం చేశారు. కోర్టుకెళితే తాత్కాలిక ఉత్వర్వులతో ఊరట దొరికింది తప్ప శాశ్వత పరిష్కారం దొరకలేదు. చిన్నమ్మాయి విషయంలోనూ అదే పోరాటం అదే తాత్కాలిక ఫలితం. ఇది ఇక్కడితో ఆగిపోయే వ్యవహారం కాదని రాంకీకి తెలుసు. ముందు ముందు మరింతగా వేధిస్తుందనీ తెలుసు. అందుకే న్యాయపోరాటాన్ని మరో మెట్టు పైకి తీసుకుపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు తన పిటిషన్ పై స్పందించాలంటూ హైకోర్టు ఆదేశించేదాకా రాంకీ పోరు సాగింది. ఇది జరిగి ఈ మార్చికి ఏడాది కావస్తున్నా ఏ ప్రభుత్వమూ స్పందించలేదు. ఆయన మాత్రం మరో న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.
ఇదీ మిత్రుడు రాంకీ కథ. ఇపుడు నాకు కలిగిన సందేహాలు, ఆవేశాలు ఏకరవు పెడతాను.
అంబేద్కర్ ANNIHILATION OF CASTE కు 82 ఏళ్లు. ఆయనేం తుపాకీగొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకొని ఈ దేశంలో కుల నిర్మూలన గావించాలని పిలుపునివ్వలేదు. ఆయన సూచించిన ఒక నాన్ వయలంట్ మెథడ్ కులాంతర వివాహం. ఈ 82 ఏళ్లలో అలాంటి పెళ్లిళ్లు ఎన్ని జరిగాయి? వాటిలో ఎన్ని నిలబడ్డాయి? పర్యవసానాలేమిటి?...ఇలాంటి ప్రశ్నల్నింటినీ పక్కనపెడదాం. ఇన్నేళ్లలో కులాంతర వివాహాలు చేసుకున్నవారికి దొరికిన చట్టపరమైన/రాజ్యాంగపరమైన రక్షణలు ఏమిటి? రాంకీ చేస్తున్నతరహా న్యాయ పోరాటాలు గతంలో ఎన్ని జరిగాయి? …ఇవీ అసలు ప్రశ్నలు!
ఈ ప్రశ్నలకు సమాధానాలు వింటే మతి పోతుంది. కారణం, సమాధానాలు లేకపోవడమే. ఒక్కటంటే ఒక్క నికరమైన పోరాటం నమోదు కాలేదు. మీరు ఢిల్లీలో కనుక్కోండి, మిగిలిన 28 రాష్ట్రాల్లో కనుక్కోండి, సుప్రీంకోర్టులో కనుక్కోండి, హైకోర్టుల్లో కనుక్కోండి…నో యూజ్! గూగుల్లో ఎంత కొట్టినా అప్పుడెప్పుడో బాంబే హైకోర్టులో జరిగిన ఒకటీ అరా అరకొర కేసుల వివరాలు కనిపిస్తాయి తప్ప దీన్నొక లాజికల్ కంక్లూజన్ కు తీసుకుపోయిన న్యాయపోరాటాలు కనిపించవు. కులాన్నీ మతాన్నీ జమిలిగా ఎదుర్కొన్న సాహాసమే నమోదు కాలేదు ఇన్నేళ్లలో.
దేశంలో కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తున్నాయి. విప్లవ పార్టీలు పనిచేస్తున్నాయి. దళిత బహుజన పార్టీలు పనిచేస్తున్నాయి. అనేక సంస్థలు, సంఘాలు ఉండనే ఉన్నాయి. చట్టసభల్లో కాలుమోపిన ఎందరో మహానుభావులు! ఎందరో ప్రగతిశీలురు! ఎందరో ప్రజాస్వామికవాదులు!...ఎవ్వరికీ ఈ ఆలోచన రాలేదు. కుల నిర్మూలనకు తక్షణం దోహదం చేసే కులాంతర వివాహాలను రక్షించుకోవాలని, వాటికో కొత్త అస్తిత్వాన్ని సాధించి పెట్టాలని, ఇందుకోసం న్యాయపోరాటం చేయాలని ఎందుకు తట్టలేదో?!
దళిత బహుజనులు ఒక వాదన చేయొచ్చు. కులాలు రద్దయ్యే పరిస్థితే ఉంటే తమ రిజర్వేషన్ల మాటేమిటని? కులపరంగా ఉన్న ఇతర రక్షణల మాటేమిటని? కులం వద్దనుకుంటే కూటికి పగయ్యే ప్రమాదముంది నిజమే. కానీ, ఆ రిస్కు తీసుకునే వాళ్లకు ఆప్షన్ ఉండాలా వద్దా? ఏ రిస్కూ లేని సెక్షన్ల బుద్ధిజీవుల మాటేమిటి? కులమతాలు వదులుకున్నామని, వాటికి అతీతంగా బతుకుతున్నామనీ చెప్పుకునే మేధావులకు నిత్య జీవితంలో రాంకీకి ఎదురైన సమస్యలూ ప్రశ్నలూ ఎందుకు ఎదురుకాలేదు? వాళ్లంతా ఎందుకు స్పందించలేదు? స్కూళ్లలో, అధికార పత్రాల్లో భద్రంగా కులాలూ మతాలూ రాసుకుంటూ పూసుకుంటూ కేవలం కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారా?!
ఇందులో సమర్థింపులకు ఏమీలేదు. సాంకేతికపరమైన ఆంశాలూ లేవు. అంతా నాన్ సీరియస్. నేను రాండమ్ గా కొందరు బుద్ధిజీవులైన పెద్దమనుషుల్ని అడిగాను ఈ కుల మతాల విషయంలో మీరేం చేశారు, మీ పిల్లల్ని ఏం చేయబోతున్నారని. ఎవరి దగ్గరా సమాధానం లేదు. చెప్పిన సమాధానాల్లో దమ్ములేదు. అదే ఉంటే ఈపాటికి కులమతరహిత అస్తిత్వం కింద ఒక తరం తయారై ఉండేది. ఒక హోప్ వచ్చివుండేది. అలాంటి ఆశను రేకెత్తిస్తున్నారు మిత్రుడు రాంకీ. తనతో చేతులు కలుపుదాం. తనకు అవసరమైన సమాచారాన్ని సేకరిద్దాం. తన ఆన్ లైన్ క్యాంపెయిన్ ను విస్తరిద్దాం. తను దాఖలు చేసిన కేసుల్లో ఇంప్లీడవుదాం. అధికార లావాదేవీల్లో, చదువుల్లో నో క్యాస్ట్ నో రిలీజియన్ ఆప్షన్ సాధిద్దాం. ఓటర్లకు నోటా ఉన్నట్టే కులమతాలు వద్దనుకొనేవాళ్లకూ ఒక నోటా ఉండితీరాలి!
On 05th March 2018, He Posted on My Face Book Wall
i.e., Ramki Dvrkrao
Hemen destekle
Bu kampanyayı imzala
Bağlantıyı kopyala
Facebook
WhatsApp
X
E-posta