Petition updateNo Religion No Caste .. One More Option Please..Kerala Foot Baller Vineet Declared their son's Religion - NIL
RAMAKRISHNA RAO D​.​V.Hyderabad, TG, India
Mar 20, 2018
నా కొడుకు మతం నిల్‌ ( ఏదీ లేదు)! తిరువనంతపురం: మతం గురించి జరిగే గొడవలు అతణ్ని చికాకు పెట్టాయో లేక అన్ని మతాలు సమానమేనన్న భావనో తెలీదు కానీ కేరళకు చెందిన ఓ ఫుట్‌బాలర్‌ నిర్ణయం మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్‌‌ తరఫున ఫుట్‌బాల్ ఆడుతున్న 29 ఏళ్ల వినీత్‌ అనే ఫుట్‌బాలర్‌ సతీమణి ఈ మధ్యనే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కేరళ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే వినీత్‌.. కొడుకు మతం విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నాడు. జనన ధృవపత్రంలో ఏ మతమో వెల్లడించే కాలమ్ వద్ద నిల్‌(ఏదీలేదు) అని రాశాడు. ‘ప్రపంచం మొత్తం ఒకటే మతం ఉంది. కాకపోతే పాటించే విధానంలోనే అనేక రకాలు’ అని చెప్పిన బెర్నాడ్‌షా సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని మతం గురించి తన కొడుకుదే అంతిమ నిర్ణయం అని వెల్లడించాడు. పెద్దయ్యాక వాడికి ఏ మతం నచ్చుతుందో దాని ప్రకారమే నడుచుకుంటాడన్నాడు. ప్రస్తుతం ఏ టోర్నీలు లేకపోవడంతో కొడుకుతోనే తన సమయాన్నంతా గడుపుతున్నాడు ఈ కేరళ ఫుట్‌బాలర్‌.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X