Update zur PetitionMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

వాల్మీకి బోయ‌ల ఎస్టీ సాధ‌న‌కై.. ఛ‌లో ఢిల్లీ

Venkateshwarlu BoyaHyderabad, Indien
03.03.2018
మార్చి 5 నుంచి మ‌లిద‌ఫా పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో బోయ‌లను ఎస్టీలుగా గుర్తించే బిల్ పై మ‌రోసారి ఆశ‌లు చిగురిస్తున్నాయి. ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ‌లు పార్ల‌మెంట్ పెద్ద‌ల‌ను క‌లిసి విన‌తిపత్రాలు ఇవ్వ‌డం జ‌రుగుతోంది. ఏపీలోని ఓ వ‌ర్గం సుభాష్ చంద్ర‌బోస్ నేతృత్వంలోని వాల్మీకి రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి మార్చి 12న ఛ‌లో ఢిల్లీ పోగ్రామ్ తో ముందు కెళుతోంది. ఇందుకోసం రెండు ద‌క్షిణాది రాష్ట్రాల వాల్మీకి నేత‌ల‌ను క‌లిసి మ‌ధ్ద‌తు కోసం అహ‌ర్నిష‌లు శ్ర‌మిస్తున్నారు. ఇక తెలంగాణ వాల్మీకి బోయ నాయ‌కులు మాత్రం వ‌ర్గాల కార‌ణంగా ఎటు తేల్చుకోలేక పోతున్నారు. ఏది ఏమైనా ఈ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఎస్టీ బిల్ ప్ర‌వేశ‌పెడితేనే మ‌న క‌ల నేరవేరుతుంది. లేదంటే ఇక అట‌కెక్కిన‌ట్టే.. తమ రాజకీయాలను పక్కనా పెట్టి ఉద్యమమూ లో పాల్గోనే సమయం ఆసన్నమైంది అని కావున అందరూ కలిసి ఏక‌తాటిపై నిల‌బ‌డి ఆలోచ‌న..కాదు కార్య‌చ‌ర్య‌ణ చేసుకొని ముందుకు సాగ‌వ‌ల‌సిందిగా మ‌న‌వి. ఇట్లు మీ బోయ‌జాతి ముద్దుబిడ్డ వెంక‌టేశ్వ‌ర్లు బోయ.
Link kopieren
WhatsApp
Facebook
E-Mail
X