Обновление к петицииMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి ST పునరుద్ధరణ పై సంఘాల నాయకులు పార్టీల అభిమానం పక్కనపెట్టి జాతికోసం కలసిరావలసిన అవసరం ఉంది!

Venkateshwarlu BoyaHyderabad, Индия

19 сент. 2017 г.
వాల్మీకి సోదరులకు మనవి !
తెలంగాణా లో వాల్మీకి ST పునరుద్ధరణ కు ఎటువంటి చర్యలు తీసుకున్నారో, ఆంద్రప్రదేశ్ లో వాల్మీకి ST పునరుద్ధరణ కు ఎటువంటి చర్యలు తీసుకున్నారో మనఅందరికీ తెలిసిన విషయమే సత్యపాల్ అధ్యయనం పూర్తీ బూటకం అనికూడా స్పష్టంగా తెలియవస్తుంది. ST పునరుద్ధరణ సాధనకు గత 60 సంవత్సరాల నుండీ చేస్తున్న ఉద్యమం వాళ్ళ ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదన్నది వాస్తవం.
ఆంద్రప్రదేశ్ లోని బోయలు ఇంతవరకూ ఏ ప్రభుత్వంపైన కూడా తిరుగుబాటు చెయ్యకపోవడం వల్లానే సమశ్యపరిస్కారం కాకపోవడానికి కూడా ప్రధానకారణం . మరో కారణం వాల్మీకి జాతిలోని సంఘాలనాయకుల స్వార్థభుద్ది తో ఉద్యమాలు రాజకీయపార్టీలకు దాసోహం అవుతున్నాయి. ఇప్పటికైనా అన్ని వాల్మీకి సంఘాలు, నాయకులు పార్టీల అభిమానం పక్కనపెట్టి జాతికోసం కలసిరావలసిన అవసరం ఉంది .
అక్టోబర్ 5 న మన ST పునరుద్ధరణ పై ఆశలు రేకెత్తించి ప్రభుత్వం తరుపున మనకు st పునరుద్ధరణ పై గట్టిహామీ ఇచ్చి కూడా st పునరుద్ధరణ పై నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా ,ఫెడరేషన్ పేరుతో మన చిరకాల వాంఛ అయున st పునరుద్ధరణ తొక్కివెయ్యాలి అనే స్వార్దభుద్దితో ఉన్న ప్రభుత్వానికి మన నిరసన తెలియచెయ్యాల్సి అవసరం ,సమయం ఆసన్నమైంది .
ప్రభుత్వం నిర్వహించే వాల్మీకి జయంతిని భహిస్కరిన్చి మన మహర్షి వాల్మీకి వారి జయంతిని మనమే జరుపుకుందాము . అందుకుసంభందించిన ప్రణాళికరూపకల్పనకు సంభందించిన సమావేశం ఏర్పాటుకు సంభందించిన తేదీ త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది .
ఉధ్యమాభి వందనాలతో ....మీ ...రేనాటి శ్రీనివాస్
Подписать
Подписать петицию
Скопировать ссылку
WhatsApp
Facebook
Nextdoor
Эл. почта
X