Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APఏపీలో వాల్మీకి ఎస్టీ రణం ఎప్పుడో..?

Venkateshwarlu BoyaHyderabad, India

May 29, 2016
అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి. మహానాడు అయిపోయింది. ఇంకా ఏముంది వాల్మీకులకు చెప్పడానికి బాబుగారి దగ్గర ఒక్క కేంద్ర తప్ప. ఫిబ్రవరి 15.2016 చంద్రబాబు వీఆర్ పీ ఎస్ నేతలకు ఇచ్చిన హామి ఏమయింది? 15 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి సీఎం కు లెటర్ ఇచ్చిన కాల్వ శ్రీనివాసులుగారి మాట ఏమయింది? గత మూడు రోజులుగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో కాపుల గురించి మాట్లాడారు కానీ.. బోయల గురించి మరిచారు. కనీసం ఒక్కమాట మాట్లాడలేదు. ఇక్కడ కావాల్సింది మాటలు కాదు.. చేతలు అని మన వాల్మీకి నేతలకు ఇప్పటికైనా అర్థమయి ఉండాలి..
1. గవర్నర్ ప్రసంగంలో చేర్చడం
2. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం
3. మూడు నెలల కాలపరిమితితో కమిటి వేయడం
ఈ మూడు తీర్మానాలలో ఒకటి తప్ప అన్నీ గాలికొదిలేశారు బాబుగారు. వచ్చే సమావేశాల్లో చూద్దాం అని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుగారు అంటున్నారని చెబుతున్నారు. ఏపీలో వాల్మీకుల ఎస్టీ రణం ఎప్పుడు కదులుతుందో మరి..?
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X