Neuigkeit zur PetitionMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APబోయ‌ల‌కిచ్చిన హామిని రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలు నెర‌వేర్చాలి: బోయ‌ జేఏసీ
Venkateshwarlu BoyaHyderabad, India
13 mag 2016
వాల్మీకి బోయ‌ల‌కు ఎన్నిక‌ల్లో ఇచ్చిన‌ హామిని రాష్ట్రంలో టీ స‌ర్కార్, కేంద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వాలు నెరవేర్చాల‌ని తెలంగాణ వాల్మీకి సంఘాల జాయింట్ యాక్ష‌న్ క‌మిటి క‌న్వీన‌ర్ మండ్ల వేణుగోపాల్ డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ తెగ‌ల విచార‌ణ క‌మిష‌న్ కార్యాల‌యంలో చైర్మ‌న్ డాక్ట‌ర్ చెల్ల‌ప్ప‌ను గురువారం కో క‌న్వీన‌ర్ల‌తో క‌ల‌సిన‌ ఆయ‌న జేఏసీ త‌యారు చేసిన తుది రిపోర్టును క‌మిష‌న్ కు అందించారు. అనంత‌రం మీడియ‌తో మాట్లాడుతూ బోయ‌ల‌ను ఎస్టీలో చేర్చ‌డానికి వేసిన చెల్ల‌ప్ప క‌మిటీ రీపోర్టును వెంట‌నే తెప్పించుకోవాల‌న్నారాయ‌న‌. అసెంబ్లీలో ఎస్టీ తీర్మానాన్ని చేసి వెంట‌నే కేంద్రానికి పంపాల‌ని మండ్ల వేణుగోపాల్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వాన్ని కోరారు. బోయ‌లు రాష్ట్రంలో బీద ప‌రిస్థితులో న‌గ‌రాల‌కు వ‌ల‌స‌లు పోయి దుర్భ‌ర జీవితాన్ని గ‌డుపుతున్నార‌ని జేఏసీ క‌న్వీన‌ర్ అన్నారు. అనంత‌రం మీడియా క‌న్వీన‌ర్లు వెంక‌టేశ్వ‌ర్లు బోయ‌, అంజి బుడ్డ‌న్న‌గారు క‌ల‌సి చేంజ్ డాట్ ఓఆర్ జీ ఆన్ లైన్ పిటీష‌న్ కాపీని చెల్ల‌ప్ప‌కు అందించారు.
Jetzt unterstützen
Petition unterschreiben
Link kopieren
WhatsApp
Facebook
X
E-Mail