విక్టోరియా మెమోరియల్ హోమ్ (అనాధ పిల్లల) ఆస్తులపై కన్నెస్తే ఖబడ్దార్!


తల్లిదండ్రులు లేని (అనాథ) బాల బాలికల ఆశాకిరణం కొత్తపేట రంగారెడ్డి జిల్లాలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇది ఎవడబ్బ సొమ్ము కాదు. స్వతంత్రప్రతిపత్తి గల విద్యాసంస్థ. స్కూల్ విద్యార్థుల భవిష్యత్తు గురించి.. వారికి ఉన్నత చదువులు కోసం ఏం చేయాలో ఆలోచించండిగాని స్కూల్ ఆస్తులను అమ్ముకోవడం, లీజుకు ఇవ్వాలన్న ప్రయత్నాలు మానుకోండి మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.
1997 నుంచి అక్కడ 10వ తరగతి చదివిన విద్యార్థులకు నేరుగా సాంఘీక సంక్షేమ జూనియర్ కాలేజీలో స్పెషల్ కోటా కింద అడ్మిషన్లు ఇచేవారు ఇప్పుడు ఎందుకు ఆ పద్ధతికి స్వస్థి చెప్పారో విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జూనియర్ కాలేజీ గా మారుస్తామని చెప్పి ఎన్ని ఏళ్లు అయ్యింది. ఎందుకు చేయలేదో కూడా వివరణ ఇస్తే మంచింది.
మంత్రి సబితా మేడం గారు గతంలో, స్కూల్ పరిపాలనా అధికారులు, అర్బన్ డేవేలప్మెంట్ కమీషనర్ చెట్లు నాటడానికి భూమిని లీజుకు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ ఆస్తులపై కన్నేస్తే మా పూర్వ విద్యార్థుల సంఘం చూస్తూ ఊరుకోదు జాగ్రత్త
ఇట్లు
విఎంహోమ్ పూర్వ విద్యార్థులు
హైదరాబాద్
9391204009
(Venkateshwarlu Boya, Telangana Journalist)